FBI Reward: భారతీయ మహిళ అచూకీ చెబితే 10వేల డాలర్ల రివార్డు: ఎఫ్‌బీఐ
FBI Reward: అమెరికాలో గుజరాతీ మహిళ అదృశ్యమై నాలుగేండ్లు అయ్యింది. 29 ఏళ్ల మయూషీ భగవత్ ఆచూకీ చెబితే పది వేల డాలర్లు ఇవ్వనున్నట్లు ఎఫ్‌బీఐ ప్రకటించింది. తన వెబ్ పేజీలో ఎఫ్‌బీఐ ఈ రివార్డు ప్రకటన చేసింది.
న్యూయార్క్: అమెరికాలో భారతీయ మహిళ నాలుగేళ్ల నుంచి అదృశ్యమైంది. ఆమె ఆచూకీ తెలిపిన వారికి 10 వేల డాలర్లు ఇవ్వనున్నట్లు ఎఫ్‌బీఐ(FBI Reward) ప్రకటించింది. 29 ఏళ్ల మయూషీ భగత్.. న్యూజెర్సీలో ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైంది. 2019, ఏప్రిల్ 29వ తేదీన ఆమె కనిపించకుండాపోయింది. ఆమె ఇంటి నుంచి వెళ్లినప్పుడు కలర్ పైజామా, బ్లాక్ టీ షర్ట్ ధరించింది. మయూషీ మిస్సింగ్ పై ఆమె కుటుంబసభ్యులు మే 1వ తేదీనే ఫిర్యాదు చేశారు.
మయూషీ భగత్ మిస్సింగ్ గురించి ఎఫ్‌బీఐ నివార్క్ ఫీల్డ్ ఆఫీస్, జెర్సీ సిటీ పోలీసు శాఖ ఆమె కోసం వెతుకుతూనే ఉన్నది. అయితే ఆమె లొకేషన్‌ను ఇంకా గుర్తించకపోవడంతో ఎఫ్‌బీఐ రివార్డు ప్రకటించింది. ఆమె సమాచారం ఇచ్చిన వాళ్లకు పదివేల డాలర్లు ఇవ్వనున్నట్లు ఎఫ్‌బీఐ తెలిపింది.
1994లో వడోదరాలో మయూషీ జన్మించారు. స్టూడెంట్ వీసాపై ఆమె అమెరికా వెళ్లింది. న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆమె చదువుతోంది. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలను మాట్లాడగలదని ఎఫ్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది. ఎఫ్‌బీఐ తన మోస్ట్ వాంటెడ్ పేజీలో మయూషీ భగత్‌కు చెందిన మిస్సింగ్ పర్సన్ పోస్టర్‌ను పోస్టు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

