Nitish Kaushal | అమెరికా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో భారత మూలాలున్న నితీశ్ కౌషల్
Nitish Kaushal | అగ్రరాజ్యం అమెరికా (USA) లో అంతర్జాతీయ నేర ముఠాలపై ఎఫ్‌బీఐ (Federal Bureau of Investigation) చర్యలను వేగవంతం చేసింది. తాజాగా భారత మూలాలున్న నితీశ్ కౌశల్ (Nitish Kaushal) ను మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో చేర్చింది. హత్యలు, కిడ్నాప్‌లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వసూళ్లు, ఆయుధాల అక్రమ రవాణా, మనీ లాండరింగ్, మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో అతనికి ప్రమేయం ఉన్నట్లు ఎఫ్‌బీఐ ఆరోపించింది.
Nitish Kaushal : అగ్రరాజ్యం అమెరికా (USA) లో అంతర్జాతీయ నేర ముఠాలపై ఎఫ్‌బీఐ (Federal Bureau of Investigation) చర్యలను వేగవంతం చేసింది. తాజాగా భారత మూలాలున్న నితీశ్ కౌశల్ (Nitish Kaushal) ను మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో చేర్చింది. హత్యలు, కిడ్నాప్‌లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వసూళ్లు, ఆయుధాల అక్రమ రవాణా, మనీ లాండరింగ్, మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో అతనికి ప్రమేయం ఉన్నట్లు ఎఫ్‌బీఐ ఆరోపించింది.
ఎఫ్‌బీఐ వివరాల ప్రకారం.. నితీశ్ కౌశల్‌కు జగ్గు భగవాన్‌పురియా ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్రూప్‌తో సంబంధాలు ఉన్నాయి. పంజాబ్‌లో ప్రారంభమైన ఈ ముఠా అమెరికాలోని కాలిఫోర్నియా సెంట్రల్ జిల్లా సహా పలు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ నేర ముఠా తరఫున నితీష్ కౌశల్ కిడ్నాప్‌లు, దాడుల వంటి హింసాత్మక చర్యల్లో నేరుగా పాల్గొన్నట్లు దర్యాప్తులో తేలిందని ఎఫ్‌బీఐ తెలిపింది.
నితీశ్ కౌశల్ వద్ద ఆయుధాలు ఉండే అవకాశం ఉందని, అతను అత్యంత ప్రమాదకర వ్యక్తిగా పరిగణించాలని ఎఫ్‌బీఐ హెచ్చరించింది. పరారయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉందని పేర్కొన్నది. అతడి ఆచూకీ తెలిసినవారు సమీప ఎఫ్‌బీఐ కార్యాలయానికి లేదా అమెరికా రాయబార కార్యాలయం, కాన్సులేట్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నితీశ్ కౌశల్‌పై 2026 జూన్ 25న కాలిఫోర్నియా సెంట్రల్ జిల్లా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
‘రాకెటీరింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ కరప్ట్ ఆర్గనైజేషన్స్ (RICO)’ చట్టం కింద కుట్ర ఆరోపణలు నమోదు చేసింది. జగ్గు భగవాన్‌పురియా నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ‘ఆపరేషన్ హార్డ్ బాల్’ లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అమెరికా, కెనడా, యూరప్‌లో ఈ ముఠాపై దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

