కుమార్తె ఆన్లైన్ క్లాస్ కోసం.. వర్షంలో గొడుగు పట్టిన తండ్రి

బెంగళూరు: భారీ వర్షంలో రోడ్డు పక్కన మొబైల్లో ఆన్లైన్ క్లాస్ వింటున్న కుమార్తెకు ఆమె తండ్రి గొడుగుపట్టారు. కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని మారుమూల బల్లాకా గ్రామంలో ఒక జర్నలిస్ట్ తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి చదువుతున్నది. గ్రామంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో తండ్రి నారాయణ ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటలకు తన కుమార్తెను గ్రామానికి కాస్త దూరానికి తీసుకెళ్తాడు. మొబైల్లో ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యే రోడ్డు పక్కన ఉన్న ఆ ప్రాంతానికి ఆమె ప్రతి రోజు వచ్చి ఆన్లైన్ క్లాసులు వింటుంది. ఇటీవల వర్షం కురియడంతో ఆన్లైన్ క్లాస్ వింటున్న కుమార్తెకు తండ్రి నారాయణ గొడుగుపట్టారు. స్థానిక జర్నలిస్ట్ తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, దక్షిణ కన్నడ జిల్లా పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం సరిగా లేదని, దీనికి ఈ ఫొటో అద్దం పడుతున్నదని జర్నలిస్ట్ మహేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తిగార్, బల్లాకా, కమీల గ్రామాల విద్యార్థులు ఆన్లైన్ తరగతుల కోసం తమ ఇండ్లను వీడి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలకు వెళ్తుంటారని చెప్పారు. స్థానికులంతా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్పైనే ఆధారపడి ఉన్నారని, కరెంట్ లేని వేళల్లో నెట్వర్క్ పనిచేయదని విమర్శించారు. దీనిపై స్పందించిన బీఎస్ఎన్ఎల్ అధికారి సమస్యను పరిష్కరించేందుకు భారతీ ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

