Fake ED Raid | నగల వ్యాపారి షాపు, ఇంటిపై నకిలీ ఈడీ దాడులు.. వీడియో వైరల్
Fake ED Raid | నగల వ్యాపారి షాపు, ఇంటిపై నకిలీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరిగాయి. కొందరు మోసగాళ్లు నకిలీ ఈడీ అధికారులుగా అవతారమెత్తారు. నగల వ్యాపారి షాపు, ఇంటిపై రైడ్ చేశారు. ఆస్తులు, నగదు వివరాలు వెల్లడించాలని వ్యాపారి కుటుంబాన్ని బెదిరించారు.
అహ్మదాబాద్: నగల వ్యాపారి షాపు, ఇంటిపై నకిలీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరిగాయి. (Fake ED Raid) కొందరు మోసగాళ్లు నకిలీ ఈడీ అధికారులుగా అవతారమెత్తారు. నగల వ్యాపారి షాపు, ఇంటిపై రైడ్ చేశారు. ఆస్తులు, నగదు వివరాలు వెల్లడించాలని వ్యాపారి కుటుంబాన్ని బెదిరించారు. రూ.25 లక్షల విలువైన నగలు, నగదు అపహరించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ ముఠాను అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని కచ్‌లో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 2న గాంధీధామ్‌లోని రాధిక జ్యువెలర్స్ యాజమానికి చెందిన షాపుతోపాటు ఇంటిపై నకిలీ ఈడీ అధికారులు దాడులు చేశారు.
ఈడీ అధికారిగా పేర్కొన్న ఒక వ్యక్తి ఐడీ కార్డు చూపించాడు. అకౌంట్ల వివరాలు చెప్పాలని ఆ వ్యాపారిని డిమాండ్ చేశాడు. దీని కోసం 15 నిమిషాల సమయం ఇచ్చాడు. తప్పుగా చెబితే అరెస్ట్ చేసి జైలుకు పంపుతానని బెదిరించాడు. చివరకు ఆ ముఠా సభ్యులు రూ.25 లక్షల విలువైన నగలు, నగదుతో పారిపోయారు.
కాగా, బాధిత నగల వ్యాపారి దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు వెంటనే స్పందించారు. పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. 12 మంది సభ్యులున్న నకిలీ ఈడీ ముఠాను అరెస్ట్ చేశారు. తాళ్లతో వారి చేతులు కట్టి వీధుల్లో ఊరేగించారు. సంఘటనా స్థలానికి తీసుకెళ్లి నేరం జరిగిన విధానాన్ని తెలుసుకున్నారు.
మరోవైపు ఈడీ అధికారిగా నటించిన శైలేంద్ర దేశాయ్ ఫేక్ రైడ్‌కు సూత్రధారి అని పోలీస్ అధికారి తెలిపారు. ఈ ముఠాకు చెందిన ఒక మహిళను కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుల నుంచి రూ.45 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ముఠా కార్యకలాపాలు, ఇతర నేరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఫేక్ ఈడీ రైడ్‌తోపాటు పోలీసులు నిందితులను తాళ్లతో కట్టి రోడ్డుపై నడిపించి తీసుకెళ్లిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
देखिए कैसे गुजरात के कच्छ के गांधीधाम इलाके में नक़ली ईडी की टीम ने फ़र्ज़ी रेड करके इलाके के प्रसिद्ध ज्वैलरी व्यवसायी के परिवार को बनाया बंधक.
वीडियो साभार: @SP_EastKutch #Fake #EDTeam #Busted pic.twitter.com/iWoNmFmnPM— Prashant Gupta (@GuptaJi_Journo) December 9, 2024
Kutch Fake ED Team : જુઓ પોલીસ નકલી ED અધિકારીઓની શું હાલત કરી | Gujarat First
પોલીસનો ડંડો જ લાવશે હવે નકલીઓની શાન ઠેકાણે!નકલી ED ઓફિસર બનીને ધાક જમાવનારાના ડગમગ્યા પગ
કચ્છ પોલીસે નકલી EDના આરોપીઓ પાસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન
તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઇ કરાવ્યું… pic.twitter.com/08XINksUjC— Gujarat First (@GujaratFirst) December 6, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

