Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Delhi Police : సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) గత జూలైలో చేపట్టిన ఆందోళన ఎంత హింసాత్మకంగా మారిందో తెలిసిందే. అయితే, ఈసారి ఎలాంటి హింస, దాడులకు అవకాశం లేకుండా ఢిల్లీ పోలీసులు గట్టి ముందస్తు చర్యలతో సిద్ధమయ్యారు.
Delhi Police : సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) గత జూలైలో చేపట్టిన ఆందోళన ఎంత హింసాత్మకంగా మారిందో తెలిసిందే. అయితే, ఈసారి ఎలాంటి హింస, దాడులకు అవకాశం లేకుండా ఢిల్లీ పోలీసులు గట్టి ముందస్తు చర్యలతో సిద్ధమయ్యారు. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, రూఫ్‌టాప్ స్పాట్టర్స్ వంటివి భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. దీనివల్ల ఎవరైనా ఆందోళనకారులు ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా వారిని సులభంగా గుర్తించే వీలుంటుంది.
అలాగే, చట్టం ముందు నిలబెట్టేందుకు ఆధారాలు కూడా లభిస్తాయి. ఇదే సమయంలో అసలు ఆందోళనకారులు జంతర్ మంతర్ వద్దకు చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు. వేలాదిమందిని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. మెట్రో రైళ్లు సహా పలు ప్రజా రవాణా వ్యవస్థను స్తంభింపజేశారు. సరిహద్దులు, కీలక ప్రాంతాలు, రోడ్లు మార్గాలను మూసివేసి, భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ సీజేపీ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం జరగాల్సి ఉంది.
అయితే, ఈ కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇదే సమయంలో నేతలెవరూ రాకుండా ముందస్తుగా వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. కొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఇదే సమయంలో జంతర్ మంతర్ ప్రాంతం ఉన్న సెంట్రల్ ఢిల్లీలో ఎక్కువ సంఖ్యలో ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్స్, సీసీటీవీ కెమెరాలు వంటివి ఏర్పాటు చేశారు. డ్రోన్లను వినియోగిస్తూ నిఘాను పెంచారు. భద్రతను, అక్కడి పరిస్థితిని నిత్యం ఢిల్లీ పోలీసులు పరిశీలిస్తున్నారు.
పోలీసులు ఎవరి మీద దాడి చేసినా, పోలీసుల మీద దాడి చేసిగా గుర్తించేందుకు వీలుగా.. పోలీసులకు బాడీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు తక్కువ కాంతిలో కూడా బాగా పని చేస్తాయి. వాయిస్‌ను కూడా రికార్డు చేస్తాయి. ఢిల్లీ పరిధిలో 35,000 మంది పోలీసులు పని చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఆందోళన కోసం 7,000 మంది ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీ చేరుకున్నట్లు అంచనా. ఢిల్లీలో ఎక్కడా జనాలు గుమికూడకూడదని పోలీసులు హెచ్చరించారు. సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సెస్ కూడా ఈ భద్రతా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. వారు పలు ఆయుధాల్ని కూడా వాడుతున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

