రీడింగ్ గ్లాసెస్‌కు ఇక చెల్లు.. కంటి చూపు మందగించిన వారికి సరికొత్త ఐ డ్రాప్స్!
కంటిచూపు మందగించిన వారికి కళ్లద్దాల అవసరాన్ని దూరం చేసే కొత్త ఐ డ్రాప్స్ మార్కెట్లోకి రానున్నాయి. ముంబైకు చెందిన ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ అనే ఫార్మా కంపెనీ తయారుచేసిన ఈ ఐ డ్రాప్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది.
ముంబై, సెప్టెంబర్ 3: కంటిచూపు మందగించిన వారికి కళ్లద్దాల అవసరాన్ని దూరం చేసే కొత్త ఐ డ్రాప్స్ మార్కెట్లోకి రానున్నాయి. ముంబైకు చెందిన ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ అనే ఫార్మా కంపెనీ తయారుచేసిన ఈ ఐ డ్రాప్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. వయసు పెరుగుతున్న కొద్దీ కంటిచూపు మందగించే సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. దీనినే ప్రెస్బియోపియా అంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 109 నుంచి 180 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా 40 -45 ఏండ్ల వయసులో ఈ సమస్య మొదలవుతుంది. 60 ఏండ్ల వయసు వచ్చే నాటికి తీవ్రమవుతుంది.
ప్రెస్బియోపియా ఉన్న వారికి దగ్గరి వస్తువులు సరిగ్గా కనిపించవు. ఏదైనా చదవాలంటే కళ్లద్దాలు తప్పనిసరి అవుతుంది. ఈ సమస్యకు చికిత్స చేసేందుకు ‘ప్రెస్వు ఐ డ్రాప్స్’ను ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసింది. దీనిని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ)కు చెందిన నిపుణుల బృందం సిఫార్సు చేయడంతో డీసీజీఐ తుది అనుమతి ఇచ్చింది. ఈ ఐ డ్రాప్స్ వేసుకోవడం వల్ల ప్రెస్బియోపియా బాధితులకు కళ్లద్దాల అవసరం తగ్గుతుందని ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. దీని ధర రూ.350 వరకు ఉంటుందని, అక్టోబరు మొదటి వారం నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

