Ethanol Fuel Stations | వాహనదారులకు తీపికబురు..! త్వరలోనే అందుబాటులోకి ఇథనాల్ బంకులు..!
Ethanol Fuel Stations | వాహనదారులకు కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. టాప్ రిఫైనరీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దేశవ్యాప్తంగా 300 ఇథనాల్ ఫ్యుయల్ స్టేషన్లను నెలకొల్పనున్నదని తెలిపారు.
Ethanol Fuel Stations | వాహనదారులకు కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. టాప్ రిఫైనరీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దేశవ్యాప్తంగా 300 ఇథనాల్ ఫ్యుయల్ స్టేషన్లను నెలకొల్పనున్నదని తెలిపారు. ఇథనాల్ బంకులను తెరవాలన్న తన డిమాండ్‌కు పెట్రోలియం మంత్రి అంగీకరించారని పేర్కొన్నారు. పుణేలో జరిగిన కాన్ఫరెన్స్‌లో గడ్కరీ చెప్పారు.
చమురు దిగుమతిలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దిగుమతిదారుగా ఉందన్నారు. 2070 నాటికి జీరో కార్బన్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇంతకు ముందు కేంద్రమంత్రి గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో మాట్లాడుతూ.. ‘క్విట్ ఇండియా’ ఉద్యమం మాదిరిగానే భారత్ నుంచి పెట్రోల్, డీజిల్‌ను తరిమికొట్టే మిషన్‌లో తానున్నానని తెలిపారు. వాయు కాలుష్యాన్ని నిరోధించేందుకు.. దిగుమతి చేసుకునే ముడి చమురుపై భారత్ ఆధారపడడాన్ని తగ్గించేందుకు స్వచ్ఛమైన, ప్రత్యామ్నాయ ఇంధనాల ఉత్పత్తి, వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడానికి హైడ్రోజన్, ఎలక్ట్రిక్, ఫ్లెక్స్ ఇంధన కార్లలో ప్రయాణిస్తానన్నారు. బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి మనం ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు.. అదేవిధంగా దేశం నుంచి పెట్రోల్ డీజిల్‌ను తరిమివేద్దామన్నారు. దేశం వాయుకాలుష్య సమస్యను ఎదుర్కొంటోందని, ఇందులో రవాణారంగం నుంచే 40శాతం వాటా ఉందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

