Rahul Gandhi: ఇంగ్లీష్‌తో సాధికారత.. సిగ్గుచేటు కాదు : రాహుల్ గాంధీ
Rahul Gandhi: ఇంగ్లీష్ సిగ్గుపడే భాష కాదు అని, అది సాధికారతను కల్పించే భాష అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రతి చిన్నారికి ఇంగ్లీష్ భాషను నేర్పించాలని రాహుల్ అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: ఇంగ్లీష్ భాష మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలకు ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కౌంటర్ ఇచ్చారు. ఇంగ్లీష్ సిగ్గుపడే భాష కాదు అని, అది సాధికారతను కల్పించే భాష అన్నారు. ప్రతి చిన్నారికి ఇంగ్లీష్ భాషను నేర్పించాలని రాహుల్ అభిప్రాయపడ్డారు. కానీ బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఆ భాషను పేద పిల్లలు నేర్చుకోకుండా చేస్తోందని, ఎందుకంటే ప్రశ్నించడం వాళ్లకు ఇష్టం ఉండదని, సమానత్వాన్ని వాళ్లు కోరుకోవడం లేదని రాహుల్ అన్నారు. తన ఎక్స్ అకౌంట్లో హిందీ భాషలో రాహుల్ గాంధీ ఇవాళ ఓ పోస్టు చేశారు. ఇంగ్లీష్ భాష ఆనకట్ట కాదు అని, అదో వారధి అన్నారు.
ఇంగ్లీష్ నేర్చుకోవడం సిగ్గుచేటు కాదు అని, అది సాధికారత ఇస్తుందన్నారు. ఇంగ్లీష్ గొలుసు కాదు అని, అది గొలసుల్ని బ్రేక్ చేసే పరికరం అన్నారు. భారత దేశ పేద ప్రజలు ఇంగ్లీష్ నేర్చుకోవద్దన్న ఆలోచనలో బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఉన్నట్లు రాహుల్ ఆరోపించారు. మాతృభాష తరహాలోనే ఇంగ్లీష్ భాష ముఖ్యమైందని, ఎందుకంటే అది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని, ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తుందన్నారు. ప్రతి భారతీయ భాషకు ఆత్మ, సంస్కృతి, జ్ఞానం ఉన్నాయని, వాటిని ఆదరించాలని, అదే సమయంలో ప్రతి చిన్నారికి ఇంగ్లీష్ భాషను నేర్పాలన్నారు. ప్రపంచంతో పోటీపడాలంటే ఇండియాకు ఇదో మార్గమని, ఇది ప్రతి పిల్లవాడికి సమాన అవకాశం కల్పిస్తుందన్నారు.
अंग्रेज़ी बाँध नहीं, पुल है।
अंग्रेज़ी शर्म नहीं, शक्ति है।
अंग्रेज़ी ज़ंजीर नहीं – ज़ंजीरें तोड़ने का औज़ार है।BJP-RSS नहीं चाहते कि भारत का ग़रीब बच्चा अंग्रेज़ी सीखे – क्योंकि वो नहीं चाहते कि आप सवाल पूछें, आगे बढ़ें, बराबरी करें।
आज की दुनिया में, अंग्रेज़ी उतनी ही ज़रूरी… pic.twitter.com/VUjinqD91s
— Rahul Gandhi (@RahulGandhi) June 20, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

