MLA beaten | సరైన సమాధానం చెప్పట్లేదని.. బీజేపీ ఎమ్మెల్యేను కొట్టిన ప్రజలు
MLA beaten | ఏనుగుల దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహించిన ప్రజలు బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై దాడికి దిగారు. ముదిగెరు ఎమ్మెల్యే కుమారస్వామి చొక్కా చించేసి ఆయన కారును ధ్వంసం చేశారు.
MLA beaten | కర్నాటకలో ముదిగెరె బీజేపీ ఎమ్మెల్యేను స్థానిక ప్రజలు తీవ్రంగా చితకబాదారు. ఆయన దుస్తులను చింపేశారు. తమకు సమాధానం ఇవ్వకుండా ఎమ్మెల్యే మిన్నకుండి పోవడమే ప్రజల ఆగ్రహానికి కారణమైంది. సెక్యూరిటీ గార్డులను ఆయన్ను కారులో ఎక్కించి క్షేమంగా తరలించారు. ఈ ఘటన చిక్మగ్లూరు హల్లెమనే గ్రామంలో జరిగింది.
కుందూరుకు చెందిన శోభ ఇటీవల గడ్డి కోసేందుకు వెళ్లగా.. ఏనుగు దాడి చేయడంతో చనిపోయింది. దీనిపై గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఆమె కుటుంబీకులను పరామర్శించేందుకు ముదిగెరె ఎమ్మెల్యే కుమారస్వామి వచ్చారు. బాధిత మహిళ ఇంటి వద్ద గుమిగూడిన గ్రామస్థులు ఆయనను ఇంటిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఏనుగుల దాడులను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. దాంతో బిత్తరపోయిన ఎమ్మెల్యే సమాధానం చెప్పకుండా మిన్నకుండిపోయారు. దాంతో మరింత ఆగ్రహించిన ప్రజలు ఆయన చొక్కా చించి కొట్టారు. ఆయన కారును కూడా ధ్వంసం చేశారు. సెక్యూరిటీ గార్డులు కల్పించుకుని ఆయనను కారులో క్షేమంగా పక్కకు తీసుకెళ్లారు.
తనపై గ్రామస్థులు పథకం ప్రకారం దాడి చేశారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్యే కుమారస్వామి చెప్పారు. ఏనుగుల దాడిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేలోపుగా ఒక వర్గం వారు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఏనుగులు గత కొన్నాళ్లుగా గ్రామాలపై పడి పంటలు నాశనం చేస్తున్నాయని, పలువురిని తీవ్రంగా గాయపరిచాయని స్థానికులు చెప్తున్నారు. ఏనుగులను అదుపుచేసేందుకు స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేయాలని తాలూకా కాఫీ గ్రోయర్స్ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ కేంద్రాన్ని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

