‘సర్’ సాఫ్ట్‌వేర్‌ను వెల్లడించలేం అది వ్యాపార రహస్యం: ఈసీ
ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో లోటుపాట్లను గుర్తించేందుకు వాడిన సాఫ్ట్వేర్ వివరాలను వెల్లడించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించింది.
న్యూఢిల్లీ: ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో లోటుపాట్లను గుర్తించేందుకు వాడిన సాఫ్ట్వేర్ వివరాలను వెల్లడించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించింది. హిందూస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ‘ఈ సమాచారం వ్యాపార రహస్యానికి, మేధో సంపదకు సంబంధించినది.
దీన్ని సమాచార హక్కు చట్టం కింద బహిర్గతం చేయలేం’ అని ఈసీ పేర్కొంది. ఓటర్ల జాబితాలో వ్యత్యాసాలను గుర్తించడానికి కృత్రిమ మేధ లేదా మెషీన్ లెర్నింగ్ ఉపయోగిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఈసీ స్పష్టం చేయలేదు. సాఫ్ట్వేర్ సొంతంగా తప్పులను గుర్తిస్తుందా అనే ప్రశ్న స్పష్టతను కోరేదని పేర్కొంటూ దానికి సమాధానాన్ని నిరాకరించింది.
సాఫ్ట్‌వేర్‌పై ఈసీ సమాచారాన్ని దాస్తున్నది: కాంగ్రెస్
ఈసీఐనెట్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎన్నికల సంఘం దాచి పెట్టిందని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ ఆదివారం ఆరోపించారు. హిందూస్థాన్ టైమ్స్ రిపోర్ట్‌ను ప్రస్తావిస్తూ పారదర్శకత లోపించడం, కృత్రిమ మేధను ఉపయోగించడం వల్ల ‘సర్’ ప్రక్రియ విశ్వసనీయత దెబ్బతిన్నదని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

