శరత్‌రెడ్డి విరాళాలపై చర్యలేవి?
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ దర్యాప్తు తీరుపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు.
- బీజేపీకి 60 కోట్లు ఇవ్వడంపై స్పష్టమైన ఆధారాలున్నా చర్యలు తీసుకోని ఈడీ
- ఆధారాలు లేకుండానే ఆప్ నేతల అరెస్టులు
- మద్యం పాలసీ కేసులో ఈడీ తీరుపై ఆప్ ప్రశ్నలు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ దర్యాప్తు తీరుపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ కేసులో నిందితుడైన శరత్ చంద్రారెడ్డి నుంచి కేంద్రంలోని బీజేపీకి రూ.60 కోట్లు వెళ్లాయని, ఈ వ్యవహారంపై దర్యాప్తు సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. దేశంలో రెండు రకాల చట్టాలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. మద్యం పాలసీ కేసులో శరత్ రెడ్డి ఒక కీలక వ్యక్తి అని ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో చెప్పిందని, అయితే ఆ వ్యక్తే బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.60 కోట్లు విరాళం ఇచ్చారని, అయినా ఈ విషయంలో ఈడీ ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
కస్టడీ నుంచి బీజేపీకి విరాళాలు ఎలా?
శరత్ రెడ్డి మద్యం పాలసీ కేసులో అరెస్టు అయిన తర్వాత 2022, నవంబర్ 15న బీజేపీకి రూ.5 కోట్లు ఇచ్చారని సంజయ్ సింగ్ తెలిపారు. జైల్లో ఆరు నెలలు ఉన్న తర్వాత 2023, మే 8న ఆయనకు బెయిల్ వచ్చిందని, అనంతరం కొద్ది రోజుల్లోనే అధికార బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.50 కోట్లు విరాళంగా అందజేశారని పేర్కొన్నారు. అరెస్టుకు ముందు కూడా 2022లో విడతలవారీగా రూ.5 కోట్లు ఇచ్చాడని సంజయ్ సింగ్ చెప్పారు. కస్టడీలో ఉన్న శరత్ రెడ్డి బీజేపీకి కోట్లాది రూపాయలు ఎలా ఇవ్వగలిగాడో ఈడీ సమాధానం చెప్పాలన్నారు.
తప్పుదోవ పట్టించేందుకు అమిత్‌షా యత్నం
శరత్ చంద్రారెడ్డి విరాళం విషయంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్‌షా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సంజయ సింగ్ ఆరోపించారు. శరత్‌చంద్రా రెడ్డి మధ్యప్రదేశ్ బీజేపీ యూనిట్‌కు విరాళం ఇచ్చిన విషయాన్ని ఆయన అంగీకరించారని, అయితే అతను నిందితుడయితే, విరాళం ఇచ్చి ఉండకూడదని చెప్పుకొచ్చారని పేర్కొన్నారు. ఇన్ని ఆధారాలున్నా, ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోదని, అయితే మద్యం పాలసీ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే తనతోపాటు కేజ్రీవాల్, సిసోడియాను అరెస్టు చేశారని సంజయ్ సింగ్ విమర్శించారు. దేశంలో రెండు రకాల చట్టాలు ఉన్నాయా? అని ప్రశ్నించిన సంజయ్ సింగ్.. ఇది పూర్తిగా అన్యాయమని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

