న్యూఢిల్లీ: సిమ్ కార్డులు పూర్తిగా కనుమరుగు కానున్నాయి. వీటి స్థానంలో ఈ-సిమ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు నెట్‌వర్క్‌లు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఒక్కో ఈ-సిమ్‌కు ఉండే ఒక్కో ప్రత్యేక కోడ్‌తో ఇవి పనిచేస్తాయి. ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కు ఈ-సిమ్‌ను మార్చే అవకాశముండదు. ఈ-సిమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడంలో అనేక సమస్యలొస్తున్నాయి. దీంతో ఈ-సిమ్ ట్రాన్స్ఫర్ను సులభతరం చేయాలని గూగుల్ భావిస్తున్నది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ వర్షన్లో కొత్త ఫీచర్‌ను జోడించబోతున్నది.