UP Shocker | గన్‌తో బెదిరించి మహిళపై లైంగిక దాడి.. రికార్డ్ చేసిన వీడియో వైరల్, ఆత్మహత్యకు యత్నించిన బాధితురాలు
UP Shocker | భర్త లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన కొందరు వ్యక్తులు ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇది బాధితురాలి దృష్టికి వెళ్లడంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది.
లక్నో: భర్త లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన కొందరు వ్యక్తులు ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇది బాధితురాలి దృష్టికి వెళ్లడంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్డోయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గతవారం బంధువులైన ఇద్దరితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఒక ఇంట్లోకి చొరబడ్డారు. ఒంటరిగా ఉన్న 30 ఏళ్ల మహిళకు ఒక వ్యక్తి గన్ గురిపెట్టాడు. మరో వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇద్దరు వ్యక్తులు దీనిని వీడియో రికార్డ్ చేశారు. ఎలక్ట్రిక్ ఆటో నడిపే భర్తకు బాధిత భార్య ఈ విషయం చెప్పింది. దీంతో అతడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
కాగా, నిందితులు ఆ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇది బాధితురాలి దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన భర్త ఆమెను కాపాడాడు. తొలుత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.
మరోవైపు ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. భూ వివాదం నేపథ్యంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి వీడియో రికార్డ్ చేసినట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు. నిందితుల కోసం వెతుకుతున్నామని పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

