Principal Forces Teacher To Drink Alcohol | లేడీ టీచర్‌ను మద్యం తాగాలని, స్మోక్ చేయాలని బలవంతం చేసిన ప్రిన్సిపాల్
Principal Forces Teacher To Drink Alcohol | స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్న మహిళను ప్రిన్సిపాల్ వేధించాడు. మద్యం సేవించిన అతడు తనతో కలిసి మందు తాగాలని, సిగరెట్ కాల్చాలని బలవంతం చేశాడు. తన మాట వినని ఆమెను మరునాడు స్కూల్లో అవమానించాడు. మోకాళ్లపై కూర్చొమన్నాడు.
భోపాల్: స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్న మహిళను ప్రిన్సిపాల్ వేధించాడు. మద్యం సేవించిన అతడు తనతో కలిసి మందు తాగాలని, సిగరెట్ కాల్చాలని బలవంతం చేశాడు. (Principal Forces Teacher To Drink Alcohol ) తన మాట వినని ఆమెను మరునాడు స్కూల్లో అవమానించాడు. మోకాళ్లపై కూర్చొమన్నాడు. ఆ ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేని ఆ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఈ సంఘటన జరిగింది. కాన్వెంట్ స్కూల్‌కు చెందిన ప్రిన్సిపాల్ క్షితిజ్ జాకబ్ పని సాకుతో ఉపాధ్యాయురాలిని బయటకు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించిన అతడు మందు తాగాలని, స్మోక్ చేయాలని ఆమెను బలవంతం చేశాడు. అభ్యంతరం చెప్పిన ఆ టీచర్‌ను మరునాడు స్కూల్ ముందు అవమానించాడు. మోకాళ్లపై కూర్చొవాలంటూ వేధించాడు.
కాగా, ఆ ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్లుగా ఆ ప్రిన్సిపాల్ తనను వేధించడంతోపాటు తనపట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆమె ఆరోపించింది. ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరించడంతో ఇప్పటి వరకు మౌనంగా ఉన్నట్లు తెలిపింది. తాజా వేధింపులను భరించలేక న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పింది.
మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ స్కూల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అలాగే అక్కడి సిబ్బంది స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. లేడీ టీచర్‌ను వేధించిన స్కూల్ ప్రిన్సిపాల్‌పై తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

