DRDO Scientist | డీఆర్డీవో శాస్త్రవేత్తకు గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్ అవార్డు ప్రదానం
DRDO Scientist | బెంగుళూరు : డీఫెన్స్ రీసర్చ్ ఆర్గనైజేషన్‌కు చెందిన డాక్టర్ కే వీరబ్రహ్మంకు గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్ 2023 పురస్కారం లభించింది. ఈ మేరకు బెంగళూరు వేదికగా జరిగిన కార్యక్రమంలో కర్ణాటక హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రితూ రాజ్ అవస్థి చేతుల మీదుగా గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్ 2023 అవార్డును డాక్టర్ కే వీరబ్రహ్మం అందుకున్నారు.
DRDO Scientist | బెంగుళూరు : డీఫెన్స్ రీసర్చ్ ఆర్గనైజేషన్‌కు చెందిన డాక్టర్ కే వీరబ్రహ్మంకు గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్ 2023 పురస్కారం లభించింది. ఈ మేరకు బెంగళూరు వేదికగా జరిగిన కార్యక్రమంలో కర్ణాటక హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రితూ రాజ్ అవస్థి చేతుల మీదుగా గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్ 2023 అవార్డును డాక్టర్ కే వీరబ్రహ్మం అందుకున్నారు.
ఈ సందర్భంగా అవార్డు అందుకున్న డాక్టర్ కే వీరబ్రహ్మంకు ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్‌తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణానికి ముప్పు లేని, భూమిలో కలిసిపోయే బయోడీగ్రేడబుల్ సంచులు రూపొందించినందుకు గానూ ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రతిష్టాత్మకమైన అవార్డుకు వీరబ్రహ్మంను ఎంపిక చేశారు.

పాలీథీన్ క్యారీ బ్యాగులు.. భూమిలోకి కానీ నీటిలో కానీ కరిగిపోవు. అవి విచ్ఛిన్నమై భూమిలో కలవటానికి 300 నుంచి 500 సంవత్సరాలు పడుతుంది. దీని వల్ల భూమి మీద ప్లాస్టిక్ వ్యర్ధాలు విలయ తాండవం చేసి గాలి, నీటి కాలుష్యాన్ని కలుగ జేస్తున్నాయి. క్యారీ బ్యాగుల్లో ఉన్న ఆహారాన్ని సంచితో కలిపి తినడం వల్ల ఆవులు, పశువులు చనిపోతున్నాయి. ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించడానికి పాలిథీన్ బ్యాగులకు ప్రత్యామ్నాయంగా 120 రోజుల్లో భూమిలో కలిసిపోయి ఎరువుగా మారే బయోడిగ్రేడబుల్ బ్యాగులను మొక్కజొన్న, బయోపాలిమర్లను కలిపి రూపొందించారు. ఈ బ్యాగుల వల్ల పర్యావరణానికి ముప్పులేదు. పశువులు తిన్నా చనిపోవు.
ఈ టెక్నాలజీని డీఆర్డీవో ఇప్పటికే 40 కంపెనీలకు ఉచితంగా అందించింది. ఇంకా 50 కంపెనీలు ఈ టెక్నాలజీ కోసం వినితి పత్రం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ టెక్నాలజీ ఎలా వినియోగించాలి, ఫార్ములా, యంత్రాలు, నాణ్యత ప్రమాణాలు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వంటి అవగాహన కార్యక్రమాలను వార్తాపత్రికలు, యూట్యూబ్ మాధ్యమాలలో ఉంచింది. పర్యావరణానికి ముప్పులేని, భూమిలో కరిగిపోయే బయోడిగ్రేడబుల్ బ్యాగులను రూపొందించినందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్, ఢిల్లీ ఈ ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును ఎన్విరాన్మెంట్, మేనేజ్మెంట్, క్లైమెటిక్ చేంజ్ 2023 సదస్సు నందు బెంగుళూరులో ప్రదానం చేయడం జరిగినది. విశేష కృషి చేసి ఈ అవార్డు పొందిన డాక్టర్ కే వీరబ్రహ్మంను మిగిలిన శాస్త్రవేత్తలు, పర్యావరణ శ్రేయోభిలాషులు అభినందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Building Collapse | మా ఇల్లే కూలిపోతుందేమోనని పరుగులు పెట్టాం.. ఢిల్లీ ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి
‘ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు’
Rahul Gandhi | నాతో చర్చకు వస్తే మోదీ దేశ ద్రోహి అని ఐదు నిమిషాల్లో నిరూపిస్తా : రాహుల్‌గాంధీ
Uttar Pradesh: భార్యను కుర్చీకి కట్టేసి.. పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన భర్త
కారేపల్లిలో పశువుల సంత వేలం ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

