డిప్రెషన్లో యువకుడి చేతివాటం.. చెంపదెబ్బలు కొట్టి జైలు పాలయ్యాడు
తండ్రి మరణం, తల్లి ద్వితీయ వివాహంతో నైరాశ్యంలోకి జారుకున్న 23 ఏండ్ల యువకుడు అందులోనుంచి బయటపడేందుకు ఎంచుకున్న మార్గం అతడిని కటకటాలపాలు చేసింది.
లక్నో: తండ్రి మరణం, తల్లి ద్వితీయ వివాహంతో నైరాశ్యంలోకి జారుకున్న 23 ఏండ్ల యువకుడు అందులోనుంచి బయటపడేందుకు ఎంచుకున్న మార్గం అతడిని కటకటాలపాలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నివసించే కపిల్ కుమార్ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు అపరిచితులను చెంపదెబ్బ కొట్టి సంతృప్తి పడేవాడు. ఓ మహిళను, ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారితోసహా పలువురిని చెంపదెబ్బ కొట్టినందుకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గత ఐదారు నెలలుగా ఓ వ్యక్తి అపరిచితులను చెంపదెబ్బ కొడుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల నుంచి బయటపడేందుకే తాను స్కూటర్‌పై వెళుతూ అపరిచిత వ్యక్తులను చెంపదెబ్బ కొడుతున్నట్టు కపిల్ కుమార్ చెప్పినట్టు మీరట్(సిటీ) ఎస్పీ ఆయుష్ విక్రమ్ సింగ్ తెలిపారు.
కపిల్ చేష్టలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగినట్టు ఆయన చెప్పారు. కపిల్ చేతిలో చెంపదెబ్బ తిన్న ఓ మహిళ స్థానిక రాజకీయ నాయకుడి బంధువు కావడంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. కపిల్ తండ్రి ఐదేళ్ల క్రితం మరణించాడు. తల్లి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది.
ప్రస్తుతం కపిల్ సూరజ్‌కుండ్‌లో తన తల్లి, మారు తండ్రి వద్ద ఉంటున్నట్టు పోలీసులు చెప్పారు. తనకు ఉద్యోగం లేదని, తాను చిన్నప్పటి నుంచి ఎన్ని మంచి పనులు చేసినా తనకు మంచి జరగడం లేదని అతను పోలీసులకు చెప్పాడు. చెడ్డ పనులు చేస్తే తనకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే అపరిచిత వ్యక్తులను చెంపదెబ్బలు కొడుతున్నట్టు కపిల్ చెప్పాడని ఎస్పీ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

