న్యూఢిల్లీ : కుక్కలు మనుషులతో స్నేహంగా మెలుగుతుంటాయి. తమ యజమానులకు అవసరమైన సమయంలో అన్నీ తామై శునకాలు చూసుకుంటాయి. మనుషుల పట్ల కుక్కలకు ఎంతో విశ్వాసం ఉంటుందని చెబుతుంటారు.
ఇక మనిషితో పెంపుడు కుక్క బంధానికి అద్దం పట్టేలా ఓ క్యూట్ వీడియో (viral video) సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఇన్‌స్టాగ్రాంలో వైరల్‌హాగ్ షేర్ చేసిన ఈ వీడియోలో ట్రెడ్‌మిల్‌పై ఓ మహిళ నడుస్తుండగా వర్కవుట్ సందర్భంగా ఆమె వెంట కుక్క కూడా కనిపిస్తుంది.
ఇంతకంటే పర్ఫెక్ట్ జిమ్ బడ్డీ ఉన్నారా అని వీడియోను పోస్ట్ చేస్తూ రాసుకొచ్చారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు స్పందించారు. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.