Viral Video: 4వేల డాలర్ల కరెన్సీ నోట్లను నమిలేసిన శునకం.. వీడియో
Viral Video: ఓ శునకం 4వేల డాలర్ల కరెన్సీ నోట్లను నమిలేసింది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ ఘటన జరిగింది. డబ్బుతో ఉన్న ఎన్విలాప్ను కిచెన్‌లో పెట్టిన యజమాని అనుకోని రీతిలో షాక్ అయ్యాడు. ఫెన్సింగ్ పని కోసం తెచ్చిన డబ్బును ఆ కుక్క ముక్కలు ముక్కలుగా నమిలింది.
చండీఘడ్: 4వేల డాలర్లు అంటే అక్షరాల 3.32 లక్షలు. అంత మొత్తానికి చెందిన కరెన్సీ నోట్లను ఓ శునకం నమిలేసింది. అమెరికాలోని పెన్షిల్వేనియాలో ఈ ఘటన జరిగింది. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్(Viral Video) అవుతోంది. ఓ పని కోసం తెచ్చిన నగదు డబ్బును కుక్క నమిలి మింగడంతో ఆ కుటుంబం టెన్షన్‌కు లోనైంది. పిట్స్‌బర్గ్‌లోని ఇంట్లో 4వేల డాలర్ల నగదు ఉన్న ఎన్విలాప్ను కిచెన్ షెల్ఫ్‌పై పెట్టానని క్లేటన్ లా తెలిపాడు. అయితే తమ ఇంట్లో ఉన్న శునకం ఆ మొత్తాన్ని నమిలినట్లు అతను చెప్పాడు. ముక్కలైన డబ్బు నోట్లు అన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇంటికి ఫెన్సింగ్ చేయించేందుకు తెచ్చిన డబ్బును కుక్క నమిలేసింది. ఎప్పుడూ ఏదీ ముట్టని ఆ కుక్క ఒక్కసారిగా అంత డబ్బును ముక్కలుగా నమిలిందని క్లేటన్ లా చెప్పాడు. నమిలి ఉంచిన ఆ నోట్ల ముక్కలను సేకరించినట్లు క్లేటన్ దంపతులు తెలిపారు. అయితే కేవలం 450 డాలర్లు మాత్రమే మిస్సైనట్లు వాళ్లు చెప్పారు. చిరిగిన నోట్ల గురించి ఆ జంట బ్యాంకుకు వెళ్లింది. నోట్లపై నెంబర్ కనిపిస్తే , ఆ నోట్లను తీసుకుంటామని బ్యాంకర్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

