దేవుడి సేవలో డీఎంకే!
- నాస్తికత్వం నుంచి ఆస్తికత్వంవైపు ద్రవిడ పార్టీ
- ఆలయాల పునరుద్ధరణకు వెయ్యి కోట్లు
- మసీదులు, చర్చ్‌లకు రూ.200 కోట్లు
- తీర్థయాత్రలకు రూ.25వేల చొప్పున సాయం
- ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీలు
చెన్నై, మార్చి 13: నాస్తికత్వం పునాదులపై ఏర్పాటైన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే).. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో క్రమంగా ఆస్తికత్వం వైపు మళ్లుతున్నది. తాజా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టో దీన్ని ధ్రువపరుస్తున్నది. ఆలయాల పునరుద్ధరణకు, సంరక్షణకు వెయ్యి కోట్లు కేటాయించనున్నట్టు మ్యానిఫెస్టోలో ఆ పార్టీ హామీ ఇచ్చింది. మసీదులు, చర్చ్‌లకు రూ.200 కోట్లు కేటాయించనున్నట్టు ప్రకటించింది. దేశంలోని ప్రముఖ హిందూ ఆలయాల సందర్శన కోసం వెళ్లే భక్తులకు రూ.25,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఇది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆలయాల పునరుద్ధణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని డీఎంకే హామీ ఇవ్వడంపై ఆ పార్టీ అధినేత స్టాలిన్‌కు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, విద్య, ఉద్యోగ రంగాలకు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో డీఎంకే పెద్దపీట వేసింది. రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చట్టం తెస్తామని ప్రకటించింది.
మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు..
- ప్రభుత్వ ఉద్యోగినులకు ప్రసూతి సెలవు 12 నెలలకు పొడిగింపు.
- వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షను రాష్ట్రంలో రద్దు చేయడానికి చర్యలు.
- ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదవే విద్యార్థులకు కంప్యూటర్ ట్యాబ్‌ల అందజేత. వీటి వినియోగానికి ఉచితంగా డాటా.
- పెట్రోల్, డీజిల్ ధరలను రూ.5, రూ.4 చొప్పున తగ్గిస్తాం.
- ప్రతి ఎల్పీజీ సిలిండర్‌కు రూ.100 సబ్సిడీ అందజేస్తాం.
- చిన్న, సన్నకారు రైతులు, స్వయం సహాయక బృందాల మహిళలు, విద్యార్థుల విద్యారుణాలు మాఫీ
- ఆస్తిపన్నును పెంచం..
- కొత్త మోటారు పంపుసెట్లను కొనుగోలు చేసే రైతులకు రూ.10,000 ఆర్థిక సాయం
- కరోనాతో ప్రభావితమైన రేషన్‌కార్డుదారులకు రూ.4 వేల ఆర్థిక సాయం
- పట్టణ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల కోటా 40 శాతానికి పెంపు
- అమ్మ క్యాంటీన్ల తరహాలో 500 కలైంజ్ఞర్ క్యాంటీన్లు
- జయలలిత మరణంపై సమగ్ర దర్యాప్తు.. బాధ్యులపై చట్టపరమైన చర్యలు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- DMK
- service of God
- stallin
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

