DK Shivakumar: సీఎం సిద్ధరామయ్య కాళ్లు మొక్కిన డీకే శివకుమార్
DK Shivakumar: కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇవాళ ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య కాళ్లు మొక్కారు. సీఎం సిద్ధరామయ్య ఇచ్చిన అల్పాహార విందులో ఈ ఘటన జరిగింది. సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి.
బెంగుళూరు: కర్నాటక కాంగ్రెస్‌లో మార్పు మొదలైనట్లు కనిపిస్తోంది. సిద్ధరామయ్య తన సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇవాళ బెంగుళూరులో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. సీఎం సిద్ధరామయ్యను ఆలింగనం చేసుకున్న డిప్యూటీ సీఎం శివకుమార్ ఆ తర్వాత పాదాభివందనం చేశారు. సిద్ధరామయ్య కాళ్లను మొక్కి డీకే శివ.. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ సమయంలో ఈ ఘటన జరిగింది. ఇవాళ రాష్ట్ర గవర్నర్ థావర్‌చాంద్ గెహ్లాట్ అపాయింట్మెంట్ సిద్దరామయ్య తీసుకున్నారు. బహుశా ఆయన తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించే అవకాశాలు ఉన్నాయి.
ఇవాళ తన క్యాబినెట్ మిత్రులకు సీఎం సిద్ధరామయ్య అల్పాహార విందు ఏర్పాటు చేశారు. తన అధికార నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు ఆయన క్యాబినెట్ మిత్రులు కూడా బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు హాజరయ్యారు. శివకుమార్‌ను సీఎం సిద్ధరామయ్య హత్తుకున్న ఫోటోను సీఎంవో ఆఫీసు రిలీజ్ చేసింది. ఇక తర్వాత సిద్ధరామయ్య పాదాలను శివకుమార్ తాకారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల ప్రకారమే సీఎం సిద్ధరామయ్య తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం మార్పు అంశంపై సిద్ధరామయ్య మీడియాతో ఇవాళ మాట్లాడనున్నారు. ప్రస్తుతం గవర్నర్ సిటీలో లేరు. ఆయన తన వ్యక్తిగత పనుల కోసం ఇండోర్ వెళ్లినట్లు లోక్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

