భారత్-అమెరికా బంధం బలమైనది: ఆంటోనీ బ్లింకెన్
Antony Blinken: భారత్-అమెరికా దేశాల బంధం బలమైనదని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో

న్యూఢిల్లీ: భారత్-అమెరికా దేశాల బంధం బలమైనదని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా కీలక భూమిక పోషించగలవని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా స్వేచ్ఛ, సమానత్వంపట్ల ఇరుదేశాలు తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయన్నారు. వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలకు మించి వీటికి ఎంతో ప్రాధాన్యత ఉందని ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు చేరుకున్న బ్లింకెన్, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ అయ్యారు. కొవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనే కార్యాచరణ, ఆఫ్ఘనిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారం పెంచుకోవడంపై భారత నాయకత్వంతో బ్లింకెన్ చర్చించారు. ‘ప్రాథమిక స్వేచ్ఛ, మానవ హక్కులను అమెరికా గౌరవిస్తుంది. మేం భారత్‌ను కూడా ఇదే కోణంలో చూస్తాం. భారత ప్రజాస్వామ్యం పౌరుల స్వేచ్ఛాయుత ఆలోచనలతో కూడుకున్నది’ అని వ్యాఖ్యానించారు.
ఇరు దేశాల సంబంధాల ప్రాముఖ్యతపై మాట్లాడిన బ్లింకెన్.. భారత్, అమెరికా మధ్య సంబంధాలతో పోలిస్తే ఇటువంటివి విశ్వవ్యాప్తంగా కొన్ని దేశాలకే పరిమితమైనవని అన్నారు. భవిష్యత్తులో ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం అమెరికా విదేశాంగ విధానంలో అతి ప్రధానమైనదని ఆంటోని బ్లింకెన్ స్పష్టంచేశారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

