రాజ్యసభలో కోవిడ్‌పై చర్చ..

న్యూఢిల్లీ: కోవిడ్ అంశంపై ఇవాళ రాజ్యసభలో చర్చ చేపట్టనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆ చర్చ ప్రారంభంకానున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేర్కొన్నారు. ఉదయం పెగాసస్ అంశం విషయంలో సభను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే 12 గంటలకు మళ్లీ సమావేశం అయిన తర్వాత విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. చైర్మెన్‌తో అన్ని పార్టీల నేతలు కలిశారని, వాళ్లంతా కోవిడ్‌పై చర్చ చేపట్టాలని కోరినట్లు హరివంశ్ తెలిపారు. కోవిడ్ గురించి ఒంటి గంటకు చర్చిస్తామని చైర్మన్ వెంకయ్య హామీ ఇచ్చినట్లు డిప్యూటీ చైర్మన్ తెలిపారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభను వాయిదావేశారు.
ఇక ఇవాళ ఉదయం జరిగిన బీజేపీ పార్లమెంటరీ సభ్యుల భేటీలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. విపక్షాలు కోవిడ్ వ్యాక్సినేషన్‌పై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. కేవలం రెండు, మూడు రాష్ట్రాలకే పరిమితమైన విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. వ్యాక్సిన్ల కొరత లేదని, ప్రతి ఒక్కరికీ టీకా ఇస్తామని ఆ భేటీలో మోదీ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 20 శాతం మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు టీకాలు వేసుకోలేదని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

