న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: సంతానలేమితో బాధపడుతున్నవారికి శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. వంధ్యత్వాన్ని నివారించే ఎఫ్‌సీ రిసెప్టర్ వంటి కొత్త ప్రొటీన్‌ను కనుగొన్నట్టు చెక్ అకాడెమీ ఆఫ్ సైన్స్‌కు చెందిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రకటించింది.
అండంపై ఉండే ఈ ప్రొటీన్ శుక్రకణంలోని ప్రొటీన్‌తో బలమైన బంధాన్ని ఏర్పరచి అండం ఫలదీకరణం చెందేలా చేస్తున్నదని పరిశోధనకు నేతృత్వం వహించిన కటీనా కొమరస్కోవా తెలిపారు. ఈ ప్రొటీన్‌కు గ్రీకు మాతృ దేవత మయిమా అని పేరు పెట్టారు.