Dilli Chalo: రేషన్, వంటసామాగ్రితో కదిలిన వేలాది పంజాబీ ట్రాక్టర్లు..
Dilli Chalo: వేల సంఖ్యలో రైతులు.. వేల సంఖ్యలో ట్రాక్టర్లు.. ఢిల్లీకి బయలుదేరాయి. పంజాబీ నుంచి ఆ రైతులు దేశ రాజధాని దిశగా వెళ్తున్నారు. ఆరు నెలలకు సరిపడా రేషన్‌తో వాళ్లు ముందుకు సాగుతున్నారు.
చండీఘడ్: పంజాబీ రైతులు ఢిల్లీ దిశగా కదులుతున్నారు. వేలాది సంఖ్యలో ఉన్న ట్రాక్టర్లలో వాళ్లు ఢిల్లీ బాటపట్టారు. గతంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించిన రైతు సంఘాలు ఇప్పుడు కనీస మద్దతు ధర చట్టం కోరుతూ దేశరాజధానికి వెళ్తున్నారు. ఛలో ఢిల్లీ(Dilli Chalo) మార్చ్ కోసం రైతులంతా ప్రిపేరయ్యారు. కనీసం ఆరు నెలలకు సరిపడా ఉన్న రేషన్‌తో ట్రాక్టర్లు బయలుదేరుతున్నాయి. అంబాలా-శంభూ, కనౌరి-జింద్, దాబ్‌వాలీ బోర్డర్ రూట్లో ఆ ట్రాక్టర్లు ముందుకు వెళ్తున్నాయి.
ఇవాళ ఉదయం 10 గంటలకు పంజాబ్‌లోని ఫతేగర్ సాహిబ్ నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లు బయలుదేరాయి. వాళ్లంతా శింబూ బోర్డర్ రూట్లో వెళ్తారు. మరో గ్రూపు మేహల్ కలన్ దారిలో కన్నౌరి బోర్డర్ దిశగా వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులంతా ఓ కాన్వాయ్‌లా కదిలారు. ట్రాక్టర్లలో యువకులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు.
పంజాబీ రైతులను అడ్డుకునేందుకు హర్యానాలో ఉన్న బోర్డర్ ప్రదేశాల వద్ద సెక్యూర్టీ పెంచారు. అంబాలా, జింద్, ఫతేహ్బాద్, కురుక్షేత్ర, సిర్సా వద్ద బోర్డర్లను సీజ్ చేశారు. కాంక్రీట్ బ్లాకులు, ఐరన్ మేకులు, ఇనుపు వైర్లను ఫిక్స్ చేశారు. హర్యానాలోని 15 జిల్లాలో 144 సెక్షన కింద ఆంక్షలు విధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman, Lover Kills Mother-In-Law | ప్రియుడితో కలిసి ఉన్న కోడలను పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

