Civils Ranker | ఆ పదమేంటో తెలియని పోలీసు కానిస్టేబుల్.. సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటాడు..
Civils Ranker | యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో ఓ పోలీసు కానిస్టేబుల్ సత్తా చాటాడు. ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 667 ర్యాంకు సాధించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. తాను పోలీసు ఉద్యోగంలో చేరినప్పుడు యూపీఎస్సీ పదానికి అర్థమేంటో తెలియని తనకు.. ఇప్పుడే అదే యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో 667 ర్యాంకు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని అంటున్నాడు రామ్ భజన్.

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన రామ్ భజన్ 2009లో ఢిల్లీ పోలీసు సర్వీసులో ఉద్యోగం సంపాదించాడు. ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్(IFSO) విభాగంలో రామ్ భజన్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే 2015లో తన డిపార్ట్మెంట్లో పని చేసే పోలీసు ఉన్నతాధికారి ఒకరు సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటాడు. ఆయనను ప్రేరణగా తీసుకున్న రామ్ భజన్.. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షలపై దృష్టి సారించాడు.
అప్పుడే యూపీఎస్సీ గురించి తెలుసుకున్నాడు. ఆ పరీక్షలకు కావాల్సిన సమాచారాన్ని సేకరించాడు. ఇక తన ప్రయత్నం మొదలు పెట్టాడు. వరుసగా ఏడు సార్లు విఫలమయ్యాడు. ఎనిమిదో సారి సివిల్స్ క్లియర్ చేసి.. 667 ర్యాంకు సాధించి అందరి నుంచి మన్ననలు పొందుతున్నాడు. ఈ విజయం వెనుకాల తన తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని రామ్ భజన్ పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులు రోజువారి కూలీలు అని తెలిపాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం