బెంగాలీ ఎస్సీలు బిచ్చగాళ్లు..

సిలిగురి: పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ ఇవాళ ఎన్నికల సభలో పాల్గొన్నారు. దీదీ, తృణమూల్ నేతల ఆలోచనా విధానం దారుణంగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోందని, దీదీకి చాలా సన్నిహిత నేత ఒకరు ఎస్సీ వర్గ ప్రజలను అవమానించారని, ఆ సమయంలో దీదీ కూడా ఎస్సీలను అవమానించారని, బెంగాల్లో ఎస్సీలు బికారీలంటూ ఆమె కామెంట్ చేశారని ప్రధాని మోదీ అన్నారు. మమతా బెనర్జీకి ఇంత అహంకారమా, ఆమె ఆలోచనా విధానం ఇలా ఉందా అంటూ మోదీ ఫైర్ అయ్యారు. బెంగాల్లో రాజకీయ వాతావరణం మారాల్సిన సమయం ఆసన్నమైందని, వసూళ్ల నుంచి, సిండికేట్ల నుంచి బెంగాల్కు విముక్తి లభిస్తుందన్నారు. సెక్యూర్టీ దళాలపై దాడి చేయించే వ్యూహాం దీదీని రక్షించలేవన్నారు. ఈ హింస పదేళ్ల అనైతిక పాలనను కాపాడలేదన్నారు. టీఎంసీ గుండాల పెత్తనం ఇక బెంగాల్లో నడవదన్నారు. కూచ్ బెహర్లో జరిగిన హింస పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ప్రధాని మోదీ కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

