దేశంలో నియంతృత్వం రాజ్యమేలుతోంది: మల్లిఖార్జున ఖర్గే
MalliKharjuna Kharge: దేశంలో నియంతృత్వం రాజ్యమేలుతున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే

న్యూఢిల్లీ: దేశంలో నియంతృత్వం రాజ్యమేలుతున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. ఐటీ చట్టం ప్రకారం ప్రభుత్వం ఎవరిపై నిఘా వేయాలన్నా ముందస్తు అనుమతి అవసరమని, కానీ మోదీ ప్రభుత్వం ఎలాంటి అనుమతి లేకుండా పెగాసస్ స్పైవేర్‌తో న్యాయమూర్తులు, ఆర్మీ అధికారులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులపై నిఘా వేసిందని ఆయన ఆరోపించారు. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశం ఇలాంటి చర్యకు పూనుకోదని ఖర్గే విమర్శించారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలను పరిష్కరించే ఉద్దేశం ప్రధాని నరేంద్రమోదీకి లేదని, అందుకు ఆయన ఏమాత్రం సిద్ధంగా లేరని మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. మేం ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం వెంటనే ఆల్‌పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే పెగాసస్ విషయంలో తామంతా (ప్రతిపక్షాలు) కలిసి ఉమ్మడిగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

