పెంపుడు కుక్క బర్త్‌డే సెలబ్రేషన్స్ : 350 మంది అతిధులు..భారీ కేక్..కాస్ట్లీ గిఫ్ట్‌లు!
పెంపుడు జంతువులతో మనుషులకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. జార్ఖండ్‌లోని ధన్బాద్లో ఓ కుటుంబం తమ పెంపుడు కుక్క అక్సర్ బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించింది.
రాంచీ : పెంపుడు జంతువులతో మనుషులకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. జార్ఖండ్‌లోని ధన్బాద్లో ఓ కుటుంబం తమ పెంపుడు కుక్క అక్సర్ బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించింది. కుక్క యజమానులు దాదాపు 350 మందికి గ్రాండ్ బర్త్‌డే పార్టీ నిర్వహించడం అందరినీ ఆశ్చర్యానికి లోనుచేసింది. ఇన్విటేషన్ కార్డులను ముద్రించడం నుంచి రూ . 4500 వెచ్చించి డ్రస్ కొనుగోలు చేయడం వరకూ పెంపుడు కుక్క బర్త్‌డే పార్టీకి ఆ కుటుంబం చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
धनबाद में एक पालतू कुत्ते की जन्मदिन पार्टी को देख लोग बोले ‘क़िस्मत सहो तो ऐसी’ pic.twitter.com/yRc9iqgQFo
— Shubhankar Mishra (@shubhankrmishra) December 1, 2022
పెంపుడు కుక్క బర్త్‌డే కోసం పరిసర గ్రామాల నుంచే కాకుండా బెంగాల్‌లోని శ్రీపూర్ వంటి ప్రాంతాల నుంచి అతిధులు శునకం బర్త్‌డే పార్టీ కోసం ధన్‌బాద్‌కు క్యూ కట్టారు. బర్త్‌డే జరుపుకుంటున్న కుక్క కోసం బంధువులు బహుమతులను కూడా తీసుకువచ్చారు. మూడు గోల్డ్ లాకెట్స్‌ను పెంపుడు కుక్కకు కొందరు బహుకరించారు. అక్సర్ కేక్ కటింగ్‌కు ముందు హారతి ఇచ్చారు. పెంపుడు కుక్క బర్త్‌డే వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
ఈ వీడియోలో కుక్క చెంపపై మహిళ ముద్దు పెడుతుండటం కనిపించింది. టేబుల్ పైన భారీ కేక్ కూడా ఈ వీడియోలో చూడవచ్చు. అక్సర్ తమ కుటుంబ సభ్యుల్లో ఒకరని, తమతోనే ఉంటూ..తాము తినేదే తింటుందని యజమానులు సుమిత్ర కుమారి, సందీప్ చెప్పారు. పెంపుడు జంతువులతో అనుబంధం అనేది ప్రత్యేకమైనదని, రోడ్డు పక్కన 20 రోజుల వయసున్న కుక్క పిల్లను ఇంటికి తీసుకువచ్చి పెంచుకున్నామని, ఇప్పడు దాని బర్త్‌డే ఘనంగా నిర్వహించామని సందీప్ చెప్పుకొచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- celebrates
- Dhanbad
- family
- pet dog
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

