వాటికన్ సిటీ, మక్కా తరహాలో అయోధ్య అభివృద్ధి : వీహెచ్‌పీ నేత
Ram Janmabhoomi | Ayodhya | Rabindra Narain Singh | VHP President | అయోధ్య నగరంలో నిర్మిస్తున్న రామ మందిరం హిందుత్వానికి ప్రతీకగా నిలుస్తుందని వీహెచ్‌పీ అధ్యక్షుడు రబీంద్ర నారాయణ్ సింగ్ అన్నారు. ఆదివారం ఆయన

నాగ్‌పూర్ : అయోధ్య నగరంలో నిర్మిస్తున్న రామ మందిరం హిందుత్వానికి ప్రతీకగా నిలుస్తుందని వీహెచ్‌పీ అధ్యక్షుడు రబీంద్ర నారాయణ్ సింగ్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రామజన్మ భూమిని వాటికన్ సిటీ, మక్కా తరహాలో అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. హిందువుల వివిధ విశ్వాస స్థలాల్లో కోట్లాది మంది హిందువుల అత్యున్నత పుణ్యక్షేత్రంగా శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యను వీహెచ్‌పీ ప్రకటించబోతుందనే కోణంలో రబీంద్ర నారాయణ్ చేసిన ఈ ప్రకటన కీలకమైందని పలువురు పేర్కొంటున్నారు.
ఆదివారం ఆయన నాగ్‌పూర్ ధంతోలిలో విశ్వహిందూ జనకళ్యాణ పరిషత్ విదర్భ ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న సాధువులు, వీహెచ్‌పీ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. అయోధ్యలోని రామజన్మభూమి తీర్థయాత్ర ప్రాంతాన్ని వాటికన్ సిటీ, మక్కా తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడారు వీహెచ్‌పీ చీఫ్.

మోదీ ప్రభుత్వం దేశంలో మతమార్పిడులకు విదేశీ నిధులపై విరుచుకుపడుతోందంటూ కొనియాడారు. దేశానికి సేవ చేసేందుకు హిందువులతో చేతులు కలపాలని ముస్లిం సమాజానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ‘హిందువులు తమకు ఏమీ జరగదని అనుకుంటారు. ఈ మనస్తత్వం వల్ల మనం సవాళ్లను ఎదుర్కొంటున్నాం. గిరిజన ప్రాంతాల్లో మతమార్పిడి చేసేందుకు క్రిస్టియన్ మిషనరీలు ఆయా ప్రాంతాల్లో ఆసుపత్రులు, పాఠశాలలు నిర్వహిస్తున్నాయి’ అంటూ ఆరోపించారు.
హిందూ మతాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు మిషనరీలు పూర్తి ప్రణాళికతో ఈ పని చేస్తున్నాయని విమర్శించారు. ఈ రోజుల్లో భారతదేశ ప్రజలు తమ పిల్లల్లో ‘సంస్కారం, సద్గుణాలు’ పెంపొందించుకోవడం కంటే జీడీపీపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారన్నారు. విదర్భ, తూర్పు మహారాష్ట్రలోని హిందువుల సంక్షేమం కోసం జన్ కళ్యాణ్ పరిషత్ పలు పథకాలను ప్రారంభిస్తుందని వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

