Honey Bees | తేనెటీగలు లేకుంటే మనమూ బతకలేం!
Honey Bees |‘ఈ భూమిపై తేనెటీగలు అంతరిస్తే, ఆ తర్వాత నాలుగేండ్లకు మానవ జాతి కూడా అంతరిస్తుంది. తేనేటీగలు లేకపోతే పరపరాగ సంపర్కం ఉండదు, మొక్కలు, పంటలు ఉండవు, జంతువులూ ఉండవు’ అని గ్రీన్ బెల్ట్ అండ్ రోడ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు ఎరిక్ సోలెమ్ తెలిపారు. మానవాళి మనుగడకు తేనేటీగలు ఎంత ముఖ్యమో, అవి మనకు ఎలా సాయం చేస్తాయో ఒక వీడియోలో తెలియజేశారు. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ మ్యాగజైన్ కూడా ఈ విషయాన్ని సమర్థించింది.

ప్రపంచ వ్యాప్తంగా 87 శాతం పంటలు జంతువుల వల్ల కలిగే పరపరాగ సంపర్కం వల్లే పండుతాయి. అందులోనూ తెనెటీగల వల్ల కలిగే పరపరాగ సంపర్కమే ఎక్కువ. తేనెటీగలు తమ జీవిత కాలంలో వేల పువ్వులపై వాలి మకరందాన్ని సేకరిస్తాయి. ఈ క్రమంలో అవి మొక్కల మధ్య పరపరాగ సంపర్కాన్ని పెంపొందిస్తాయి. దీని వల్ల పంటల ఉత్పత్తి, కొత్త మొక్కల పెరుగుదల సులువవుతున్నది. అయితే కాలుష్యం, రసాయన ఎరువులు, పట్టణీకరణ వల్ల తేనెటీగల సంఖ్య తగ్గిపోతుండటంతో పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరిష్కారమేమిటి?
తేనెటీగలకు హాని కలిగించే, అవి పువ్వుల సువాసనను గుర్తించకుండా చేసే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. వాటికి కలిగే ఇన్ఫెక్షన్లకు ఔషధాలు కనిపెట్టాలి. తేనెటీగల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి దెబ్బ తిన్న తేనెపట్టులను ఐసోలేషన్లో ఉంచాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి.
– నేషనల్ డెస్క్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం