న్యూఢిల్లీ : పంజాబీ సాంగ్‌కు హుషారైన స్టెప్స్, స్టన్నింగ్ డ్యాన్స్ మూమెంట్స్‌తో నవ వధువు పెర్ఫామెన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మనీష్ మల్హోత్రా వోస్ అనే పేజ్ ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భారీ లెహంగా ధరించిన ఆమె వీడియో చివరిలో పుల్ అప్స్ చేయడం ఆశ్చర్యానికి లోనుచేసింది.
ఈ షార్ట్క్లిప్లో వధువు నిమ్రిత కాంగ్ పెండ్లి దుస్తుల్లో మెరుస్తూ పంజాబీ సాంగ్‌కు అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ ఇవ్వడం అతిధులను ఆకట్టుకుంది. అందరూ తనవైపు అబ్బురంగా చూస్తుండగా డ్యాన్స్ ఫ్లోర్ మధ్యలో నిమ్రిత పుల్అప్స్ చేయడంతో అతిధులు చప్పట్లతో ఆమెను ప్రోత్సహించారు. ఎంతో ఈజ్‌తో డ్యాన్స్ మూమెంట్స్ ఇవ్వడంతో పాటు పుల్అప్స్ చేయడం ఆమె ఫిట్‌నెస్‌కు సంకేతమని పలువురు యూజర్లు ప్రశంసలు గుప్పించారు.
ఈ వీడియోను ఇప్పటివరకూ 3 లక్షల మందికి పైగా వీక్షించారు. 12 కిలోల బరువున్న లెహంగాతో నిమ్రిత ఈ పెర్ఫామెన్స్ ఇవ్వడం గ్రేట్ అని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఆమె కండలు తీరిన దేహంతో పాటు అందమైన ముఖాకృతి కలిగిఉందని మరికొందరు ప్రశంసించారు.