Delta Plus: మహారాష్ట్రలో 66కు చేరిన కరోనా డెల్టా ప్లస్ కేసులు
కరోనా డెల్టా ప్లస్| దేశంలో కరోనా మహమ్మారికి కేంద్రంగా మారిన మహారాష్ట్రలో గత కొంతకాలంగా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. అయితే ఇప్పుడు కరొనా డెల్టా వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య 66కు చేరింది.

ముంబై: దేశంలో కరోనా మహమ్మారికి కేంద్రంగా మారిన మహారాష్ట్రలో గత కొంతకాలంగా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. అయితే ఇప్పుడు కరొనా డెల్టా వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య 66కు చేరింది. శుక్రవారం థానేలో కొత్తగా మరో కేసు నమోదయిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ కరోనా కొత్త రకం వల్ల మహారాష్ట్రలో ఐదుగురు మరణించారని వెల్లడించింది. మృతుల్లో రత్నగిరికి చెందినవారు ఇద్దరు ఉండగా, ముంబై, బీడ్, రాయ్‌గడ్‌కు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారని తెలిపింది.
ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికే రాష్ట్రంలో ప్రవేశానికి అనుమతించాలని నిర్ణయించింది. రాష్ట్రానికి వచ్చేవారు తమతో పాటు వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంచుకోవాలని అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోని వారు రాష్ట్రంలోకి రావాలంటే నెగిటివ్ ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్ సంబంధిత అధికారులకు చూపించాలని స్పష్టం చేశారు. ఈ నియమాలు పాటించని వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shiraz Mehdi | చిన్న సినిమాలకు థియేటర్ల కొరత.. ఫిలిం ఛాంబర్ తీరుపై దర్శకుడు షిరాజ్ మెహదీ ఫైర్!
ENE Repeat | నార్త్ అమెరికాలో ‘ఈఎన్ఈ రిపీట్’ రచ్చ.. $2 మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా?
Krishna Burugula | సినిమాల సంఖ్య కంటే ప్రేక్షకుల గుండెల్లో స్థానమే ముఖ్యం : ‘జిగ్రీస్’ హీరో కృష్ణ బూరుగుల!
CM Revant vs Farmers | సీఎం రేవంత్‌రెడ్డి అహంకారంపై పాడి రైతుల ఆగ్రహం.. Video
Pankaja | ఆస్కార్ బరిలో తెలుగమ్మాయిల సత్తా.. అకాడమీ రేసులోకి ‘పంకజ’ షార్ట్‌ఫిలిం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

