ఢిల్లీ: పెంపుడు కుక్క పట్ల అమానుషంగా వ్యవహరించిన ఓ యూట్యూబర్‌పై సోషల్‌మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. హైడ్రోజన్ బెలూన్లతో కుక్కను గాల్లోకి ఎగరేసినందుకు ఢిల్లీకి చెందిన 27ఏండ్ల యూట్యూబర్ గౌరవ్ శర్మను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. తన పెంపుడు కుక్కను హీలియం గ్యాస్ బెలూన్లకు కట్టి గాల్లోకి ఎగరేసి వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఢిల్లీలోని మాలవ్యనగర్ లో చోటు చేసుకుంది.
కుక్క మెడను బెలూన్లకు కట్టి ఎగరేసి తన యూట్యూబ్ ఛానల్ కోసం ఓ వీడియో రూపొందించాడు. పార్క్‌లో తీసిన ఈ వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేశాడు. దీన్ని చూసిన జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జంతు హింస కేసు కింద గౌరవ్‌పై 188 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో గౌరవ్ ఆ వీడియోను తొలగించాడు. వీడియోపై విమర్శలు రావడంతో నిందితుడు మరొక వీడియోను అప్లోడ్ చేశాడు. తన పెంపుడు కుక్క డాలర్‌తో షూటింగ్ చేస్తున్నప్పుడు తగిన భద్రతా చర్యలు తీసుకున్నానని, భవిష్యత్‌లో ఇలాంటివి మరోసారి చేయనని తన వ్యూయర్స్‌కు హామీ ఇచ్చాడు.