Delhi High Court: రూహ్ అఫ్జాపై వ్యాఖ్యలు.. బాబా రాందేవ్‌పై ఢిల్లీ హైకోర్టు సీరియస్
Delhi High Court : పాపులర్ సమ్మర్ డ్రింక్ రూహ్ అఫ్జాపై వ్యాఖ్యలు చేసిన బాబా రాందేవ్‌పై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆయన వ్యాఖ్యలు అంతరాత్మను షాక్‌కు గురిచేసినట్లు హైకోర్టు జడ్జి తెలిపారు.
న్యూఢిల్లీ: పతంజలి కంపెనీ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్‌పై ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఫార్మసీ కంపెనీ హమ్దర్ద్కి చెందిన పాపులర్ డ్రింక్ రూహ్ అఫ్జాపై రాందేవ్ చేసిన వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. రూహ్ అఫ్జాను షర్బత్ జిహాద్ అని రాందేవ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హమ్దర్ద్ కంపెనీ రాందేవ్‌పై కేసు దాఖలు చేసింది. దానిపై ఇవాళ కేసు విచారణ జరిగింది. జస్టిస్ అమిత్ బన్సల్ తన ఆదేశాల్లో కఠినమైన వార్నింగ్ ఇచ్చారు. ఇది కోర్టు అంతరాత్మనే షాక్‌కు గురి చేస్తోందని, క్షమించరానిది అని కోర్టు అభిప్రాయపడింది.
ఏప్రిల్ 3వ తేదీన బాబా రాందేవ్.. రూహ్ అఫ్జాపై విమర్శలు చేశారు. తమ కంపెనీకి చెందిన గులాబ్ షర్బత్ ఉత్పత్తిని ప్రమోట్ చేసే క్రమంలో రూహ్ అఫ్జాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. హమ్దర్ద్ కంపెనీ తన సంపాదన అంతా మసీదులు, మదరసాలు కట్టేందుకు వినియోగిస్తున్నట్లు కూడా రాందేవ్ ఆరోపించారు. షర్బత్ జిహాద్ అన్న పదాన్ని కూడా ఆయన వాడారు. హమ్దర్ద్ కంపెనీపై రాందేవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, కంపెనీ ఓనర్స్కు చెందిన మతాన్ని ఆయన అటాక్ చేస్తున్నారని సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గీ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

