Delhi CM Atishi | ఢిల్లీ గ్యాంగ్స్టర్లకు అడ్డాగా మారింది.. కేంద్ర హోంమంత్రిపై ఢిల్లీ సీఎం ఫైర్
Delhi CM Atishi | ఢిల్లీ నగరం గ్యాంగ్స్టర్లకు అడ్డాగా మారిందని ఢిల్లీ సీఎం అతిశీ (Delhi CM Atishi) అన్నారు. ఢిల్లీ లా అండ్ ఆర్డర్‌ను చేతిలో పెట్టుకుని కేంద్రం ఏం చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఇటీవల ఢిల్లీలో హత్యకు గురైన యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన అతిశీ.. కేంద్ర మంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Delhi CM Atishi : ఢిల్లీ నగరం గ్యాంగ్స్టర్లకు అడ్డాగా మారిందని ఢిల్లీ సీఎం అతిశీ (Delhi CM Atishi) అన్నారు. ఢిల్లీ లా అండ్ ఆర్డర్‌ను చేతిలో పెట్టుకుని కేంద్రం ఏం చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఇటీవల ఢిల్లీలో హత్యకు గురైన యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన అతిశీ.. కేంద్ర మంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు.
ఇటీవల సుందర్‌నగరిలో ఇద్దరు యువకులు ఓ మహిళను వేధిస్తుండగా ఆమె కుటుంబీకులు, బంధువులు మందలించి పంపించారని, అది మనుసులో పెట్టుకున్న ఆ ఇద్దరు యువకులు తిరిగి కత్తులతో వచ్చి దాడికి పాల్పడ్డారని, ఆ దాడిలో 28 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని అతిశీ వెల్లడించారు. ఇవాళ మృతుడి కుటుంబాన్ని కలిసిన ఆమె రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ఢిల్లీ గ్యాంగ్స్టర్లకు రాజధానిగా మారిందని, నేరస్థులు, దోపిడీదారులు, గూండాలకు భయం లేకుండా పోయిందని అన్నారు. నేరస్థులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో నేరాలు పెరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి తాను ఓ విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నానని, ఢిల్లీ శాంతిభద్రతల బాధ్యత ఆయన చేతుల్లో పెట్టుకుని ఏం చేస్తున్నారని అతిశీ ప్రశ్నించారు. ఆయనకు ఎన్నికల ప్రచారం మీద ఉన్న ధ్యాస ఢిల్లీలో శాంతిభద్రతలపై లేదని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

