మద్యం హోం డెలివరీకి గ్రీన్ సిగ్నల్..

న్యూఢిల్లీ: సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆన్లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా మద్యం ఆర్డర్ ఇచ్చినవారికి హోం డెలివరీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. భారతీయ కంపెనీలకు చెందిన మద్యం కానీ.. విదేశాలకు చెందిన మద్యాన్ని అయినా ఇంటికి డెలివరీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వల్ల లాక్డౌన్ ఆంక్షలను ఢిల్లీలో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఎక్సైజ్ చట్టాలను సవరించారు. ఢిల్లీ అబ్కారీ శాక ప్రకటన ప్రకారం.. ఎల్-13 లైసెన్సు ఉన్న షాపులు మద్యాన్ని హోం డెలివరీ చేయవచ్చు. కానీ కచ్చితంగా ఆర్డర్ మాత్రం మొబైల్ యాప్ లేదా ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా జరగాల్సిందే. అయితే హాస్టళ్లు, ఆఫీసులు, సంస్థలకు మాత్రం మద్యం హోండెలివరీ ఉండదన్నారు. ఎల్-13 లైసెన్సు లేని వారు మద్యం హోం డెలివరీ చేయరాదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

