Manish Sisodia | మనీలాండరింగ్ కేసులో సిసోడియా కస్టడీ పొడిగింపు
Manish Sisodia | ఈడీ మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత, మాజీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 17 వరకు పొడిగించింది. దర్యాప్తు కీలక దశలో ఉందని, జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ కోర్టును ఆశ్రయించింది.
Manish Sisodia | ఈడీ మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత, మాజీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 17 వరకు పొడిగించింది. దర్యాప్తు కీలక దశలో ఉందని, జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు కస్టడీని పొడిగించింది. మరో వైపు సీబీఐ విచారిస్తున్న ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 12న విచారణ జరుగనున్నది. మద్యం పాలసీ కేసులో ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఎనిమిది గంటలకుపైగా విచారించిన ఆయనను అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. ఆ తర్వాత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఆ తర్వాత సీబీఐ కస్టడీకి ఇచ్చింది. విచారణ అనంతరం ఆయనను జ్యుడీషియల్ కస్టడీపై జైలుకు పంపింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉంటూ వస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

