కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసుకొనేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
- మధ్యంతర బెయిల్‌పై సుప్రీం తీర్పు వాయిదా
- ఈ నెల 20 వరకు కస్టడీ పొడిగించిన ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ, మే 7: ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసుకొనేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సీఎం అయినంత మాత్రాన కేజ్రీవాల్‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని, బెయిల్ ఇస్తే రాజకీయ నాయకులకు మినహాయింపు ఇచ్చినట్టు అవుతుందని ఎస్జీ తుషార్ మెహతా వాదించారు.
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు!
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఒక వేళ ఈ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే, అతను సీఎంగా అధికారిక విధులు నిర్వర్తించకూడదు. ఎందుకంటే ఇది పరస్పర ప్రభావం చూపే అవకాశం ఉన్నది. అయితే తాము ప్రభుత్వ మొత్తం పనిలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదు’ అని పేర్కొన్నది. సీఎంగా ఉన్న కేజ్రీవాల్ ఐదేండ్లకు ఒకసారి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని, అతనేమీ తరచూ నేరాలు చేసిన వ్యక్తి కాదని వ్యాఖ్యానించింది.
నిర్దిష్ట తేదీ చెప్పని కోర్టు
ధర్మాసనంలోని న్యాయమూర్తులు బుధవారం వివిధ బెంచుల్లో కూర్చొంటారని.. వీలుని బట్టి బుధవారం లేదా గురువారం లేకుంటే వచ్చే వారం కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణను కొనసాగిస్తామని సుప్రీంకోర్టు పేర్కొన్నది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరుపై తీర్పునకు నిర్దిష్ట తేదీ చెప్పలేదు.
కేజ్రీవాల్, సిసోడియా కస్టడీ పొడిగింపు
మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీ 20 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సీబీఐ కేసులో సిసోడియా కస్టడీని కూడా ఈనెల 15 వరకు పొడిగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

