Kejriwal Tweet | సిసోడియా అరెస్ట్ సీబీఐ అధికారులకే నచ్చలేదు.. రాజకీయ ఒత్తిళ్లతో తప్పక అదుపులోకి
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్ట్ సీబీఐ అధికారులకే నచ్చలేదని, చాలా మంది సీబీఐ అధికారులు మనీశ్ అరెస్టుపై వ్యతిరేక భావనతో ఉన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్ట్ సీబీఐ అధికారులకే నచ్చలేదని, చాలా మంది సీబీఐ అధికారులు మనీశ్ అరెస్టుపై వ్యతిరేక భావనతో ఉన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకపోయినా కేవలం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి సీబీఐ ఆయనను అరెస్ట్ చేసిందని విమర్శించారు.
‘సీబీఐ అధికారుల్లో చాలామందికి మనీశ్ సిసోడియాను అరెస్టు చేయడం నచ్చలేదు. సీబీఐ అధికారులకు మనీశ్‌పై మంచి గౌరవం ఉంది. పైగా ఈ కేసులో అతనికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు కూడా లేవు. అయినా అతని అరెస్టుకు రాజకీయంగా తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. రాజకీయ గురువుల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు సిసోడియాను అరెస్ట్ చేయాల్సి వచ్చింది’ అని ట్విటర్లో కేజ్రివాల్ పేర్కొన్నారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా ఆదివారం మనీశ్ సిసోడియాను తమ కార్యాలయానికి పిలిచిన సీబీఐ అధికారులు.. దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేశారు. ఆదివారం సీబీఐ కార్యాలయానికి వెళ్లడానికి ముందు మనీశ్ సిసోడియా ఆప్ మద్దతుదారులతో భారీ రోడ్ షో నిర్వహించారు. ఆప్‌ను చూసి బీజేపీ భయపడుతున్నదని, అందుకే తనను తప్పుడు కేసులో ఇరికించిందని ఆ రోడ్ షోలో సిసోడియా వ్యాఖ్యానించారు.
I am told that most CBI officers were against Manish’s arrest. All of them have huge respect for him and there is no evidence against him. But the political pressure to arrest him was so high that they had to obey their political masters
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 27, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

