Delhi blast case | ఢిల్లీ ఆత్మాహుతి దాడి కేసులో నిందితులకు 10 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
Delhi blast case | దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడి (Suicide attack) కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వైద్యులు, ఒక మత ప్రచారకుడికి ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) 10 రోజుల జ్యుడీషియల్ కస్టడీ (Judicial custody) విధించింది.
Delhi blast case : దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడి (Suicide attack) కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వైద్యులు, ఒక మత ప్రచారకుడికి ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) 10 రోజుల జ్యుడీషియల్ కస్టడీ (Judicial custody) విధించింది. వైద్యులు ముజమ్మిల్ గనయీ, ఆదిల్ రాథర్, షాహీనా సయీద్, మత ప్రచారకుడు మౌల్వీ ఇఫ్రాన్ అహ్మద్‌లను శనివారం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కోర్టులో ప్రవేశపెట్టగా.. కస్టడీ విధించారు.
ఈ కేసులో ఎన్ఐఏ ఇప్పటివరకు ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నది. మరోవైపు ఈ కేసులో కీలక కేంద్రంగా ఉన్న అల్ ఫలా యూనివర్సిటీలో తాజాగా అధికారులు సోదాలు చేశారు. కీలక నిందితురాలైన షాహీనా సయీద్ ఉన్న గదిలో రూ.18 లక్షల నగదు దొరికినట్లు పలు జాతీయ మీడియా కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నగదు మొత్తాన్ని ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ కార్యకలాపాల కోసం ఉపయోగించేందుకే దాచినట్లు తెలుస్తోంది.
కాగా ఎర్రకోట సమీపంలో ఓ ఉగ్రవాది కారులో పేలుడు పదార్థాలతో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి గాయాలయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

