Delhi air crisis | మరో 15 రోజులు రెడ్ లైట్ ఆన్, గాడీ ఆఫ్ క్యాంపెయిన్
Delhi minister Gopal Rai: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతున్నది. దాంతో వాహనాల ద్వారా విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలను కట్టడి చేయడం కోసం ఇప్పటికే

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతున్నది. దాంతో వాహనాల ద్వారా విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలను కట్టడి చేయడం కోసం ఇప్పటికే ‘రెడ్ లైట్ ఆన్, గాడీ ఆఫ్’ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 18తో ఈ క్యాంపెయిన్ ముగియనుండటంతో మరో 15 రోజులు పొడిగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. రెండో విడత ‘రెడ్ లైట్ ఆన్, గాడీ ఆఫ్’ క్యాంపెయిన్ ఈ నెల 19 నుంచి డిసెంబర్ 3 వరకు కొనసాగుతుందన్నారు.
అదేవిధంగా ఢిల్లీలో కాలుష్యం కట్టడిపై ఇవాళ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం కానున్నామని గోపాల్ రాయ్ తెలిపారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో నిర్మాణ పనులపై నిషేధం విధించాలని, పరిశ్రమలను మూసివేయాలని ఈ సమావేశంలో ప్రతిపాదించనున్నట్లు ఆయన చెప్పారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం 4 శాతం, 35-40 శాతం కొయ్యకాలు కాల్చివేత కూడా వాయు కాలుష్యానికి కారణమని పేర్కొన్నదని, ఈ శాతం విషయంలో కేంద్రం క్లారిటీ ఇవ్వాలని గోపాల్ రాయ్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

