Manish Sisodia | ఢిల్లీ కోర్టులో మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్
Manish Sisodia | లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఇవాళ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఇవాళ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ రేపు (శనివారం) విచారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనీశ్ సిసోడియా సీబీఐ కస్టడీ (CBI Ramand)లో ఉన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన కేసులో గత నెల 26న సీబీఐ అధికారులు మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేశారు.
కాగా, మనీశ్ సిసోడియా అరెస్ట్‌పై దేశవ్యాప్తంగా ఆప్ నేతలు నిరసనలకు దిగారు. అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించి సిసోడియాను అరెస్ట్ చేశారంటూ ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఆమ్ఆద్మీ పార్టీ కూడా మనీశ్ సిసోడియా అరెస్ట్ అక్రమమంటూ ఒక ప్రకటన చేసింది. అదానీ వ్యవహారం నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయించిందని ఆరోపించింది.
కాగా, గత ఆదివారం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయగానే కోర్టులో హాజరపర్చిన సీబీఐ ఐదు రోజుల కస్టడీ కోరింది. సీబీఐ కోరినట్టుగానే మనీశ్ సిసోడియాను విచారించేందుకు కోర్టులో మార్చి 3 వరకు సీబీఐ కస్టడీ విధించింది. ఇవాళ్టితో ఆ కస్టడీ గడువు ముగిసింది. ఈ క్రమంలో సిసోడియా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

