Gaurav Gogoi: పెహల్గామ్కు ఎలా పాక్ ఉగ్రవాదులు వచ్చారు?: ప్రశ్నించిన ఎంపీ గౌరవ్ గగోయ్
Gaurav Gogoi: ఆపరేషన్ సింధూర్ గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చాలా విషయాలు చెప్పారని, కానీ పెహల్గామ్కు ఎలా ఉగ్రవాదులు వచ్చారో చెప్పలేదన్నారు. లోక్‌సభలో చర్చ సమయంలో మాట్లాడుతూ మతం ఆధారంగా ప్రజల్ని ఎవరూ టార్గెట్ చేయవద్దు అని గగోయ్ అన్నారు.
న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్‌పై ఇవాళ లోక్‌సభలో చర్చ జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్(Gaurav Gogoi) మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చాలా విషయాలు చెప్పారని, కానీ పెహల్గామ్కు ఎలా ఉగ్రవాదులు వచ్చారో చెప్పలేదన్నారు. బైసారన్ పచ్చికబయళ్లకు ఉగ్రవాదులు ఎలా వచ్చారో ప్రభుత్వం చెప్పలేదన్నారు. వేల మంది టూరిస్టులు ఉండే ప్రాంతానికి ఉగ్రవాదులు ఎలా వచ్చారని అడిగారు. పెహల్గామ్ ఘటనను ఇన్ఫర్మేషన్ వార్ అని పేర్కొన్నారు. మతం ఆధారంగా ప్రజల్ని టార్గెట్ చేయవద్దు అని గగోయ్ అన్నారు. ఎలా ఆ అయిదుగురు ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి ఇండియాకు ఎంటర్ అయ్యారని, వాళ్ల ఉద్దేశం ఏంటని ఆయన అడిగారు.
పెహల్గామ్లో దాడికి పాల్పడిన అయిదుగురు ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు. వంద రోజులు దాటినా వాళ్లను ఎందుకు బంధించలేదన్నారు. ప్రభుత్వం వద్ద దానిపై సమాధానం లేదన్నారు. మీవద్ద డ్రోన్లు, పెగాసస్, శాటిలైట్లు ఉన్నాయని, కానీ ఆ ఉగ్రవాదులను మీరు పట్టుకోలేకపోయారని కాంగ్రెస్ నేత అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేశారని, కశ్మీర్ లోయకు పర్యాటకులను ఆహ్వానించారు, కానీ పెహల్గామ్ అటాక్ సమయంలో వాళ్లు నిస్సహాయులుగా ఉండిపోయినట్లు ఆయన ఆరోపించారు. పెహల్గామ్ ఉగ్రదాడికి కేంద్ర మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలన్నారు. దీనికి లెఫ్టినెంట్ గవర్నర్‌ను బలి చేయరాదు అని అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అత్యంత భయంకరమైన దాడి జరిగిందని గగోయ్ ఆరోపించారు. రఫేల్ యుద్ధ విమానాల కోల్పోయిన అంశంపై త్రివిధ దళాధిపతి అనిల్ చౌహాన్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ అంశాన్ని ఆయన గుర్తు చేశారు. పాకిస్థాన్, భారత్ మధ్య కాల్పుల విరమణ తన వల్లే జరిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటి వరకు 26 సార్లు వెల్లడించారని, దీనిపై నిజం ఏంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పెహల్గామ్ ఉగ్రదాడి, సిందూర్ ఆపరేషన్ తర్వాత జరిగిన అంతర్జాతీయ దౌత్యం గురించి వెల్లడించాలని గగోయ్ అడిగారు. పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ రుణం అందకుండా ఇండియా ఎందుకు అడ్డుకోలేదన్నారు. పాకిస్థాన్‌తో ఎందుకు కాల్పుల విరమణకు అంగీకరించారో ప్రధాని మోదీ చెప్పాలని గగోయ్ డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

