BNS | పెండ్లి పేరుతో సెక్స్ నేరం.. పదేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం
గుర్తింపును దాచి ఓ మహిళను పెండ్లి చేసుకోవడం నేరం కిందకు వస్తుందని తాజా భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) బిల్లు పేర్కొన్నది. అదేవిధంగా పెండ్లి, ప్రమోషన్, ఉద్యోగం పేరుతో మహిళలను లైంగికంగా లొంగదీసుకోవడం తీవ్రమైననేరంగా పేర్కొంటూ నిబంధనలు రూపొందించారు.
- భారతీయ న్యాయ సంహిత బిల్లులో ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: గుర్తింపును దాచి ఓ మహిళను పెండ్లి చేసుకోవడం నేరం కిందకు వస్తుందని తాజా భారతీయ న్యాయ సంహిత(BNS) బిల్లు పేర్కొన్నది. అదేవిధంగా పెండ్లి, ప్రమోషన్, ఉద్యోగం పేరుతో మహిళలను లైంగికంగా లొంగదీసుకోవడం తీవ్రమైననేరంగా పేర్కొంటూ నిబంధనలు రూపొందించారు. నిందితుడికి 10 ఏండ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
నిబంధనల మార్పులు.. చేర్పులు
ఐపీసీలోని సెక్షన్ 377, వ్యభిచార సంబంధిత నిబంధనలన కూడా కొత్త బిల్లులో ఉపసంహరించారు. సెక్షన్ 377 కింద ఉండే ‘అసహజ సెక్స్’ నిబంధనలను తొలగించారు. ప్రస్తుత నిబంధన ప్రకారం.. ఎవరైనా ప్రకృతికి విరుద్ధంగా పురుషుడు, స్త్రీ లేదా జంతువుతో అసహజ సెక్స్ పాల్పడితే 10 ఏండ్ల వరకు లేదా జీవిత ఖైదు శిక్ష కూడా పడుతుంది. భారతీయ సురక్ష సంహిత బిల్లులో తొమ్మిది నిబంధనల తొలగింపునకు ప్రతిపాదించారు. 160 నిబంధనల్లో మార్పులు చేయడంతోపాటు, కొత్తగా తొమ్మిది నిబంధనలు చేర్చారు. భారతీయ సాక్ష్య బిల్లులో(బీఎస్) ఐదు నిబంధనలు తొలగించారు. 23 నిబంధనలు మార్పులకు ప్రతిపాదనలు చేయగా, ఒక కొత్త నిబంధనను ప్రవేశపెట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

