డ్యాన్సర్‌ను కిడ్నాప్ చేసి.. సామూహిక లైంగిక దాడి
ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తన పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. బర్త్‌డే పార్టీకి ముగ్గురు డ్యానర్లను రప్పించాడు. వారు తమ డ్యాన్సులతో ఆహుతులను అలరించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్తున్న ఒక డ్యాన్సర్‌ను ఆ పార్టీలో పాల్గొన్న ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
లక్నో: ఒక డ్యాన్సర్‌ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తన పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. బర్త్‌డే పార్టీకి ముగ్గురు డ్యాన్సర్లను రప్పించాడు. వారు తమ డ్యాన్సులతో ఆహుతులను అలరించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్తున్న ఒక డ్యాన్సర్‌ను ఆ పార్టీలో పాల్గొన్న ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆమెను కారులో శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. మద్యం సేవించి ఉన్న ఆ వ్యక్తులు ఆ మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, బాధిత మహిళ తొలుత జజ్మౌ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు పట్టించుకోకపోవడంతో ఉన్నావ్ సదర్లోని కొత్వాలి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు సీరియస్‌గా స్పందించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ డ్యాన్సర్‌ను వైద్య పరీక్షల కోసం పంపారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసేందుకు వారి కోసం పోలీసులు వెతుకుతున్నారని ఉన్నావ్ ఎస్పీ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- abducted
- dancer
- gang-raped
- six men
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Runa Mafi | రుణమాఫీకి కుంటిసాకులు.. అర్హత ఉన్నా రైతుకు అందని వైనం
IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఔట్
Rice Millers | ప్రభుత్వం ఓడిందా? రైస్ మిల్లర్లు గెలిచారా?.. పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆకస్మిక బదిలీ
Bharat Summit | కరువు వేళ.. కాంగ్రెస్ వేడుక.. ఆర్భాటాలకు కోట్లు కుమ్మరిస్తున్న సర్కార్.. తాజాగా భారత్సమ్మిట్కు 50 కోట్లు
Horoscope | 13-11-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

