గుండు కొట్టించి.. చెప్పులతో ఊరేగించి
మధ్యప్రదేశ్‌లో దారుణమైన కులవివక్ష ఘటన చోటుచేసుకున్నది. అగ్రకులాలకు చెందిన గ్రామ పెత్తందారులు ఇద్దరు దళిత సోదరులకు గుండు కొట్టించి, మెడలో చెప్పుల దండ వేసి ఊరంతా ఊరేగించారు.
- మధ్యప్రదేశ్‌లో దళిత సోదరులపై దాష్టీకం
భోపాల్, అక్టోబర్ 20: మధ్యప్రదేశ్‌లో దారుణమైన కులవివక్ష ఘటన చోటుచేసుకున్నది. అగ్రకులాలకు చెందిన గ్రామ పెత్తందారులు ఇద్దరు దళిత సోదరులకు గుండు కొట్టించి, మెడలో చెప్పుల దండ వేసి ఊరంతా ఊరేగించారు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలోని దబోహా గ్రామంలో తాజాగా చోటుచేసుకున్నది. అగ్రకులానికి చెందిన వ్యక్తితో వివాదం పెట్టుకోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది.
ఓ విషయంపై జరిగిన వివాదంలో అగ్రకులానికి చెందిన దిలీప్ శర్మ అనే వ్యక్తితో సంతోష్, ధర్మేంద్ర షాక్యా ఇద్దరు సోదరులకు గొడవ జరిగిందని ఎస్పీ శైలేంద్ర సింగ్ తెలిపారు. వీరి వివాదాన్ని పరిష్కరించే పేరుతో గ్రామ పెద్దలు పంచాయతీ సమావేశం ఏర్పాటు చేశారు. వాగ్వివాదంలో గాయపడిన దిలీప్ శర్మకు రూ.1.54 లక్షలు చెల్లించాలని ఆదేశించిన పంచాయతీ.. ఆ తర్వాత ఇద్దరు దళిత సోదరులకు గుండు కొట్టించి, మెడలో చెప్పుల దండ వేసి, ఊరంతా ఊరేగించి దారుణంగా వ్యవహరించారు. ఈ ఘటనపై పోలీసులు ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. దిలీప్ శర్మతో పాటు అతని తండ్రిని అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

