గండం గడిచింది
- బలహీనపడిన తుఫాను తౌటే
- అంతకుముందు గుజరాత్, మహారాష్ట్రలలో బీభత్సం..
- గుజరాత్లో 13, ముంబైలో ముగ్గురు మృతి
- కొట్టుకుపోయిన నౌకల నుంచి పలువురిని రక్షించిన నేవీ, కోస్ట్‌గార్డ్ సిబ్బంది

ముంబై, మే 18: దేశ పశ్చిమతీరంపై విరుచుకుపడిన అతి తీవ్ర తుఫాన్ ‘తౌటే’ బలహీనపడి తుఫాన్‌గా మారింది. అది మరింత బలహీనపడి తీవ్రవాయుగుండంగా మారనున్నట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. అంతకుముందు తౌటే తుఫాన్ గుజరాత్, మహారాష్ట్రలలో బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా గుజరాత్లో పదమూడు మంది ప్రాణాలు కోల్పోగా, ముంబైలో ముగ్గురు చనిపోయారు. వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వందలాది ఇండ్లు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం అరేబియా సముద్రంలో కొట్టుకుపోయిన నౌకల్లో ఉన్న సిబ్బందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రతికూల వాతావరణం ప్రతిబంధకంగా మారింది.
కొనసాగుతున్న సహాయక చర్యలు
తౌటే తుఫాను సోమవారం గుజరాత్ వద్ద తీరం దాటడానికి కొన్ని గంటల ముందు ముంబై సమీపంలోని సముద్రంలో కొట్టుకుపోయిన రెండు భారీ నౌకల నుంచి ఇప్పటివరకు 314 మందిని భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించినట్టు అధికారులు తెలిపారు. సోమవారం మొత్తం మూడు నౌకలు (బార్జిలు), ఒక ఆయిల్ రిగ్ కొట్టుకొనిపోయాయి. వీటిల్లో 707 మంది సిబ్బంది ఉన్నారు.
ముంబైలో రికార్డు వర్షపాతం
తౌటే తుఫాన్‌తో ముంబైలో రికార్డు స్థాయి వర్షపాతం కురిసింది. 24 గంటల్లోనే 23 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మే లో ఈ స్థాయిలో వర్షం కురువడం ఇదే తొలిసారి. సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల మధ్య 23.3 సెం.మీ. వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ తెలిపింది. తుఫాన్ సంబంధిత ఘటనల్లో ముంబైలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పది మంది గాయపడ్డారు. తుఫాన్ ఉద్ధృతికి ముంబై తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసి గేట్‌వే ఆఫ్ ఇండియాను బలంగా తాకాయి. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. తుఫాన్ ధాటికి గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో రక్షణ గోడ, ఫుట్‌పాత్ దెబ్బతిన్నాయి.

రాజస్థాన్, యూపీవైపు గమనం..
సోమవారం అర్ధరాత్రి అతితీవ్ర తుఫాన్‌గా గుజరాత్ తీరం దాటిన తౌటే.. అనంతరం తీవ్ర తుఫాన్‌గా బలహీనపడిందని, క్రమంగా తుఫాన్‌గా మారిందని ఐఎండీ వెల్లడించింది. ఉత్తర-ఈశాన్యదిశగా ప్రయాణిస్తూ తీవ్ర వాయుగుండంగా మారనుందని తెలిపింది. బుధ, గురువారాల్లో ఇది రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్వైపు పయనించనున్నదని హోం శాఖ ఒక అడ్వైజరీలో తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- cyclone
- Cyclone Tauktae
- storm
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

