Crude Oil Prices | నాలుగు నెలల కనిష్టానికి క్రూడ్ ఆయిల్ ధరలు.. కారణాలు ఇవే..!
Crude Oil Prices | కొన్ని రోజుల క్రితం వరకు ప్రపంచ మార్కెట్ల (World Markets) ను కలవరపెట్టిన చమురు ధరలు ఇప్పుడు క్రమంగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య శాంతి ప్రయత్నాలు ముందుకు సాగడం ఇందుకు ప్రధాన కారణాలు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు (Crude Oil Prices) నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి చేరాయి.
Crude Oil Prices : కొన్ని రోజుల క్రితం వరకు ప్రపంచ మార్కెట్ల (World Markets) ను కలవరపెట్టిన చమురు ధరలు ఇప్పుడు క్రమంగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య శాంతి ప్రయత్నాలు ముందుకు సాగడం ఇందుకు ప్రధాన కారణాలు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు (Crude Oil Prices) నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి చేరాయి. ఇది చమురు దిగుమతులపై ఆధారపడే భారత్‌కు శుభవార్తగా చెప్పవచ్చు.
బుధవారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 76 డాలర్ల సమీపంలో కొనసాగింది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర 72 డాలర్ల వద్ద ట్రేడైంది. ఒకే రోజులో ఈ రెండు సూచీలు ఒక శాతానికిపైగా తగ్గాయి. గత నెల రోజుల్లో బ్రెంట్, డబ్ల్యూటీఐ ధరలు 20 శాతానికిపైగా పడిపోవడం గమనార్హం. ఇరాన్ సంక్షోభం ప్రారంభమైన సమయంలో హర్మూజ్ జలసంధి మీదుగా చమురు సరఫరా దెబ్బతింటుందనే భయాలు మార్కెట్లను కలవరపరిచాయి.
అయితే పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో నిలిచిపోయిన చమురు ట్యాంకర్లు మళ్లీ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం రావడంతో మార్కెట్లలో ఆందోళన తగ్గింది. అమెరికా, ఇరాన్‌తోపాటు ప్రాంతీయ దేశాల మధ్య జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు కూడా పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తున్నాయి. సరఫరాలో పెద్ద అంతరాయం ఉండకపోవచ్చనే అంచనాలు బలపడటంతో చమురు ధరలపై ఒత్తిడి పెరిగింది.
దాంతో ప్రపంచ ఇంధన మార్కెట్లలో గత కొంతకాలంగా కనిపించిన ఆందోళన తగ్గుముఖం పట్టింది. చమురు ధరల తగ్గుదల భారత్‌కు ప్రత్యేకంగా లాభదాయకంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశం తన అవసరాల్లో ఎక్కువ భాగం ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ధరలు తగ్గితే దిగుమతి వ్యయం తగ్గుతుంది. ద్రవ్యోల్బణంపై ఒత్తిడి కూడా కొంత మేర తగ్గే అవకాశం ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

