కోవిన్ వెబ్సైట్ హ్యాక్..ఆన్లైన్లో అమ్మకానికి యూజర్ల డేటా!

హైదరాబాద్: భారత్‌లో వ్యాక్సీన్ తీసుకోవాలనుకునే వ్యక్తులు తప్పనిసరిగా కోవిన్ యాప్ లేదా వెబ్సైటులో తమ వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. కోవిన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ ఫోన్‌కి వచ్చిన ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి. అందులో వ్యక్తిపేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్‌తో పాటు కొన్ని వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల వివరాలు నమోదు చేసుకోవాలి. దేశంలో ఇప్పటికే కోట్లాది మంది తమ వివరాలను కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. ఐతే ఇప్పుడు అందులో నమోదు చేసుకున్న యూజర్ల డేటా భద్రంగానే ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారుల డేటా డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉన్నట్లు హ్యాకర్స్ గ్రూప్ డార్క్ లీక్ మార్కెట్ పేర్కొంది. భారత్‌లో కొవిడ్ టీకా వేసుకున్న 150 మిలియన్ల మంది పేరు, మొబైల్ నంబర్, ఆధార్ ఐడీ, జీపీఎస్ వివరాలతో కూడిన సమాచారాన్ని 800 డాలర్లకు అమ్మకానికి ఉంచినట్లు తెలిపింది. కోవిన్ యాప్ ద్వారా టీకా తీసుకున్న వారి డేటా సురక్షితంగానే ఉందా అనే సందేహం కలుగుతోంది. దీనిపై సంబంధిత ప్రభుత్వ వర్గాలు స్పందించాల్సి ఉంది.
[ALERT] Dark Leak Market on the DarkWeb has posted a post selling information of 150 Million COVID19 Vaccinated People of India. pic.twitter.com/32Chmcao9W
— Fusion Intelligence Center @ StealthMole (@stealthmole_int) June 10, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

