Calf Resemblance To Lion | సింహాన్ని పోలిన దూడకు జన్మనిచ్చిన ఆవు
Calf Resemblance To Lion | ఆవు ఈనిన దూడ సింహాన్ని పోలి ఉన్నది (Calf Resemblance To Lion). దాని ముఖం, శరీరం, కాళ్లు, తోక వంటివి సింహం పిల్ల మాదిరిగా ఉన్నాయి. మృగరాజు మాదిరి రూపురేఖలున్న ఆ దూడ పుట్టిన అర గంటకే చనిపోయింది. ఈ విషయం సమీప గ్రామాలకు వ్యాపించింది.
భోపాల్: ఒక ఆవు సింహాన్ని పోలిన దూడకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఈ వింత సంఘటన జరిగింది. గోర్ఖా గ్రామంలో నివసించే రైతు నత్తులాల్ శిల్పాకర్కు చెందిన ఆవు ఇటీవల ఒక దూడను ఈనింది. అయితే ఆ దూడ సింహాన్ని పోలి ఉన్నది (Calf Resemblance To Lion). దాని ముఖం, శరీరం, కాళ్లు, తోక వంటివి సింహం పిల్ల మాదిరిగా ఉన్నాయి. మృగరాజు వంటి రూపురేఖలున్న ఆ దూడ పుట్టిన అర గంటకే చనిపోయింది. ఈ విషయం సమీప గ్రామాలకు వ్యాపించింది. దీంతో ఈ వింత దూడను చూసేందుకు పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ రైతు ఇంటికి తరలివచ్చారు. సింహం పిల్ల మాదిరిగా ఉన్న ఆవు దూడను చూసి ఆశ్చర్యపోయారు. దేవుడి మహిమ అంటూ కొందరు పూజలు కూడా చేశారు.
మరోవైపు జన్యుపరమైన సమస్య వల్ల ఆ దూడ అలా పుట్టినట్లు స్థానిక పశు వైద్యుడు ఎన్కే తివారీ తెలిపారు. పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడంతో దూడ రూపు రేఖలు సింహం మాదిరిగా ఉన్నాయని చెప్పారు. అంతే తప్ప ఎలాంటి మహిమ కాదని అన్నారు. అయితే ఈ వింత దూడ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

